కణేకల్లులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

On
కణేకల్లులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు

మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లులోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ అర్చకులు గణపతి హోమం, శివ సాయి విగ్రహభిషేకం, మహా మంగళహారతులు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. షిరిడి సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పార్టీ శ్రేణులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని షిరిడిసాయిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సాయినాథుని దర్శనానికి వచ్చిన ఎమ్మేల్యే కాలవ శ్రీనివాసులు కు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.  దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ  ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు, అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మేల్యే చేతుల మీదుగా భక్తులకు భోజనాలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురు పౌర్ణమి సందర్భంగా చెక్కభజన చేసిన వారికి ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.

WhatsApp Image 2024-07-21 at 9.09.32 PM

Read More అనంతపురం డీఎంహెచ్‌ఓ దేవి బదిలీ

WhatsApp Image 2024-07-21 at 9.09.44 PM

Read More ఏపీలో ‘సర్‌’ గడువు పొడిగింపు

Manassakshi Epaper
Views:155

About The Author

Related Posts

Latest News