వందరోజుల పండుగ జరుపుకుంటే సరిపోదు..!

On
వందరోజుల పండుగ జరుపుకుంటే సరిపోదు..!

మనస్సాక్షి, నార్పల: అధికార పార్టీ నాయకులు ఇది మంచి ప్రభుత్వమని కార్యక్రమాలు జరుపుకుంటే సరిపోదని, ప్రజలకు రేషన్ సరుకులు సరిగా అందుతున్నాయా లేదా అని పరిశీలించాలని మండల సిపిఐ కార్యదర్శి గంగాధర తెలిపారు. మండల వ్యాప్తంగా రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ జరగకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, అధికారులు గానీ ప్రజా ప్రతినిధులుగానే పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మండల రెవెన్యూ అధికారుల చర్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి గంగాధర కోరారు.

Manassakshi Epaper
Views:107

About The Author

Related Posts

Latest News