జేసీ కేతన్‌ గార్గ్‌, కమిషనర్‌ మేఘ స్వరూప్‌ బదిలీ 

On
జేసీ కేతన్‌ గార్గ్‌, కమిషనర్‌ మేఘ స్వరూప్‌ బదిలీ 

మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి :  రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 62 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌, బదిలీ చేశారు. అనంతపురం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కేతన్‌గార్గ్‌ను రాజమహేంద్రవరం మునిసిపల్‌ కమిషనర్‌గా నియమించారు. అదేవిధంగా అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న మేఘ స్వరూప్‌ను మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గా నియమించారు. అనంతపురం జిల్లా పరిషత్‌ సీఈఓగా ఉన్న వైఖోమ్‌ నిదియా దేవిని రాజంపేట సబ్‌ కలెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. 

Manassakshi Epaper
Views:828

About The Author

Related Posts

Latest News