అనంతపురం డీఎంహెచ్‌ఓ దేవి బదిలీ

On
అనంతపురం డీఎంహెచ్‌ఓ దేవి బదిలీ

  •  నూతన డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు  
  •  అనంతపురం సర్వజనాస్పత్రి ఆర్‌ఎంఓగా డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి 

మనస్సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ ఈబీ దేవి బదిలీ అయ్యారు. ఈమెను కడపలోని 300 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సీఎస్‌ ఆర్‌ఎంఓగా బదిలీ చేస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం డీఎంహెచ్‌ఓగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అల్లూర్‌ సీహెచ్‌సీలో వైద్యులుగా పని చేస్తున్న డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. అదేవిధంగా అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి సీఎస్‌ ఆర్‌ఎంఓగా తిరుపతి జిల్లా తడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పని చేస్తున్న డాక్టర్‌ ఓ.శ్రీనివాసరెడ్డిని నియమించారు. 
 

Manassakshi Epaper
Views:613

About The Author

Related Posts

Latest News