ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 

On
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 

మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ కత్రిమల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కత్రిమల చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ పామిడి గ్రామపంచాయతీ కార్యదర్శిగా  విధులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. అధికారులు వస్తుంటారు.. వెళ్తుంటారు.. కానీ రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసే చంద్రశేఖర్‌ లాంటి  అధికారులు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కత్రిమల సర్పంచ్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, నాగూరు ఈశ్వర్‌ రెడ్డి, సాకే ఓబులేసు,మీసాల రామచంద్ర, కృష్ణారెడ్డి,శివారెడ్డి,జనార్దన్‌ రెడ్డి, గోపాల్‌, రజాక్‌, సాలెహ, హరి, మహేశ్వర్‌ రెడ్డి, నీలకంఠారెడ్డి,నాగేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Manassakshi Epaper
Views:100

About The Author

Related Posts

Latest News