ఫలించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కృషి
On
మనస్సాక్షి, కణేకల్లు : రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కృషి ఎట్టకేలకు ఫలించింది. కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ మరమ్మతు పనులు, కణేకల్లు - గంగులాపురం వంతెన నిర్మాణం అనతికాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు సొంత నిధులతో చెరువు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ మరమ్మతు పనులు, వంతెన నిర్మాణ పనులు ఆదివారం కాంక్రీట్ స్లాబ్ తో చివరిదశ పనులు ముగించారు. వారం తరువాత వంతెన వారధిపై ఆటోలు, ఎడ్ల బండ్లు, ద్విచక్రవాహనాలకు మాత్రమే రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు లాలెప్ప, ఆనంద్, రైస్ మిల్ చంద్ర, మాబు సాబ్, బీటీ రమేష్, చాంద్ బాషా, జిలాన్, కురుబ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Latest News
14 Jul 2026 14:16:44
మనస్సాక్షి, అనంతపురం : ఏపీలో ఈనెల 24వ తేదీ వరకు ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు పెంచారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ...

