ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈగా సంపత్‌కుమార్‌

On
ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈగా సంపత్‌కుమార్‌

మనస్సాక్షి, అనంతపురం : సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్పీడీసీఎల్‌) ఉమ్మడి అనంతపురం జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా కె.సంపత్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ సంతోషరావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సంపత్‌కుమార్‌ కదిరి ఏఈ, ఏడీఈగా సుమారు 17 ఏళ్లు పని చేశారు. ఆ తర్వాత గుంతకల్లు ఏడీఈగా ఏడాది పాటు ఉన్నారు. అనంతరం హిందూపురం ఏడీఈగా నాలుగేళ్లు, ఆ తర్వాత అనంతపురం ఆపరేషన్స్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌ డీఈగా పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్‌ శాఖలో సిబ్బందిని తెలంగాణకు కేటాయించారు. అయితే ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తర్వుల మేరకు మళ్లీ ఏపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో సంపత్‌కుమార్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ)గా తిరుపతి కార్పొరేట్‌ ఆఫీస్‌గా బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా ఈఈ నుంచి సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా పదోన్నతి కల్పిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు నియమించారు. కాగా శనివారం అనంతపురంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Manassakshi Epaper
Views:798

About The Author

Related Posts

Latest News