కార్తికేయ-2 సంచలన రికార్డు

On
కార్తికేయ-2 సంచలన రికార్డు

మనస్సాక్షి డెస్క్‌ : చిన్న సినిమాగా రిలీజ్‌ అయిన కార్తికేయ 2 సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. అమెరికాలో ఈ సినిమా కలెక్షన్లు దుమ్ములపుతున్నాయి. ఇప్పటికే అక్కడ

మనస్సాక్షి డెస్క్‌ : చిన్న సినిమాగా రిలీజ్‌ అయిన కార్తికేయ 2 సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. అమెరికాలో ఈ సినిమా కలెక్షన్లు దుమ్ములపుతున్నాయి. ఇప్పటికే అక్కడ కలెక్షన్లు 1.5 మిలియన్‌ డాలర్లు చేరినట్లు సిని వర్గాలు చెబుతున్నాయి. నిఖిల్‌ హీరోగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలుచేసింది. రోజులు గడిచే కొద్దీ.. రోజురోజుకు తన లైఫ్‌ స్పాన్‌ పెంచుకుంటూ పోతుంది ‘కార్తికేయ 2’. ప్రస్తుతం సౌత్‌ నుంచి నార్త్‌ వరకూ బాక్సాఫీస్‌ దగ్గర షేకింగ్‌ కలెక్షన్స్‌ ను రాబడుతోంది. మొత్తానికి పాన్‌ ఇండియాని నిఖిల్‌ షేక్‌ చేస్తున్నాడు. మోస్ట్‌ అవైటెడ్‌ ఫిల్మ్‌ గా వచ్చిన కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఇలా సందడి చేయడం సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Manassakshi Epaper
Views:126

About The Author

Related Posts

Latest News