2023 సంక్రాంతి కానుకగా చిరు మూవీ

On
2023 సంక్రాంతి కానుకగా చిరు మూవీ

మనస్సాక్షి డెస్క్‌ : మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త సినిమా షెడ్యూల్‌ ప్రారంభమైంది.

మనస్సాక్షి డెస్క్‌ : మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త సినిమా షెడ్యూల్‌ ప్రారంభమైంది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై వస్తున్న ఈ సినిమాలో రవితేజ పవర్‌ ఫుల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్‌-అప్పీలింగ్‌, పవర్‌ ప్యాక్డ్‌ పాత్రలో చిరుని చూపించబోతున్నాడు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేస్తున్నారు.

Manassakshi Epaper
Views:26

About The Author

Related Posts

Latest News