తిరుపతిలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు
On
మనస్సాక్షి, తిరుపతి : శ్రీశ్రీ కళావేదిక, ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 9, 10 తేదీల్లో తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 48 గంటల కార్యక్రమ పోస్టర్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె. రోజా వడమాలపేటలో ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి కూడా శ్రీశ్రీ కళావేదిక పోస్టర్ లను వేర్వేరుగా తిరుపతిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త డా. వి.ఆర్. రాసాని, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రొడ్డ, ప్రధాన కార్యదర్శి అరవ జయపాల్ తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
.jpeg)
About The Author
Related Posts
Latest News
14 Jul 2026 14:16:44
మనస్సాక్షి, అనంతపురం : ఏపీలో ఈనెల 24వ తేదీ వరకు ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు పెంచారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ...

