మానసిక ఆరోగ్య వారోత్సవాల పోస్టర్లు విడుదల

On
మానసిక ఆరోగ్య వారోత్సవాల పోస్టర్లు విడుదల

మనస్సాక్షి, అనంతపురం : ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు అక్టోబర్‌ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఇండియన్‌ సైకియాట్రి సొసైటీ

మనస్సాక్షి, అనంతపురం : ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు అక్టోబర్‌ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఇండియన్‌ సైకియాట్రి సొసైటీ ఏపీ శాఖ రూపొందించిన పోస్టర్లను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తన స్వగృహంలో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక జబ్బులను మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చామని అన్నారు. మానసిక సమస్యలు ఉన్న వారు ఉపయోగించుకుని ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. అదేవిధంగా మానసిక వైకల్యం ఉన్న వారి కోసం ప్రభుత్వమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తీవ్రమైన మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం ఇప్పటి వరకు విశాఖపట్నం, ఎర్రగడ్డలో మాత్రమే వైద్యశాలలు ఉన్నాయని, త్వరలోనే కడపలో మానసిక వైద్యశాల అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు, ఏపీ సైకియాట్రి సొసైటీ అద్యక్షులు డాక్టర్‌ యెండ్లూరి ప్రభాకర్‌, అనంతపురం సైకియాట్రి అసోసియేషన్‌ సభ్యులు డాక్టర్‌ విజయకుమార్‌, డాక్టర్‌ రవికుమార్‌, కార్పొరేటర్‌ అబూసాలెహా తదితరులు పాల్గొన్నారు.

Manassakshi Epaper
Views:35

About The Author

Related Posts

Latest News