TOP STORY - Manassakshi Telugu Daily

ఎంట్రీ పాస్‌ ఉంటేనే మద్యం లాటరీకి అనుమతి
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి :  అదృష్ట లక్ష్మి లాటరీ రూపంలో తలుపు తట్టే రోజు రానే వచ్చింది..! ప్రైవేట్‌ మద్యం దుకాణాల ఏర్పాటు కోసం సోమవారం ఓపెన్‌ లాటరీ నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాకు సంబంధించి జేఎన్‌టీయూలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో, శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లకు అధికార యంత్రాంగం పూర్తి చేసింది. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసే సమయంలో జనరేట్‌ అయిన ఎంట్రీ పాస్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటేనే ఓపెన్‌ లాటరీ ప్రాంగణంలోకి దరఖాస్తుదారులను అనుమతించనున్నారు. అనంతపురం జిల్లాలో 136 మద్యం దుకాణాల ఏర్పాటుకు 3265 దరఖాస్తులు అందాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 87 షాప్‌ల కోసం 1518 మంది దరఖాస్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో 30 దుకాణాల కోసం 1159 మంది దరఖాస్తు చేశారు. అత్యల్పంగా తాడిపత్రి నియోజకవర్గంలో 20 దుకాణాలకు 106,  రాప్తాడు నియోజకవర్గంలో 13 దుకాణాల ఏర్పాటుకు 106 మంది దరఖాస్తు చేశారు. ఉవరకొండ నియోజకవర్గంలో 13 దుకాణాలకు 413 దరఖాస్తులు, శింగనమలలో 18 షాపులకు 605,గుంతకల్లు నియోజకవర్గంలో 23 దుకాణాలకు 374, రాయదుర్గం నియోజకవర్గంలో 14 షాపులకు 377,కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 10 దుకాణాలకు 154, ధర్మవరం నియోకజవర్గంలో 20 షాపులకు 219, పెనుకొండ నియోజకవర్గంలో 15 దుకాణాల ఏర్పాటుకు 338, పుట్టపర్తి నియోజకవర్గంలో 13 షాపుల కోసం 424, హిందూపురం నియోజకవర్గంలో  9 దుకాణాలకు 185, కదిరి నియోజకవర్గంలో 15 దుకాణాలకు 161, మడకశిర నియోజకవర్గంలో 10 మద్యం షాపుల కోసం    162 మంది దరఖాస్తు చేశారు.  మొత్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 223 దుకాణాలకు 4783 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 223 మద్యం దుకాణాల ద్వారా ఇప్పటికే దరఖాస్తు ఫీజు రూపంలో ప్రభుత్వానికి రూ.95 కోట్ల 66 లక్షలు సమకూరింది.

పారదర్శకంగా ఓపెన్‌ లాటరీ

పారదర్శకంగా మద్యం టెండర్లకు సంబంధించి ఓపెన్‌ లాటరీ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం జేఎన్టీయూ ఆడిటోరియంలో మద్యం టెండర్ల కోసం అవసరమైన ఏర్పాట్లను ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రామ్మోహన్‌ రెడ్డితో కలిసి పరిశీలించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ఓపెన్‌ లాటరీ ప్రక్రియ మొదలవుతుందని, ఇందుకోసం రెండు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని శివ్‌ నారాయణ్‌శర్మ తెలిపారు. దరఖాస్తుదారుడికి ఎంట్రీ పాసులు ఇవ్వడం జరుగుతుందని, వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

బాబూ.. సంపద సృష్టి ఇదేనా?
ఎక్కడికక్కడ ఇసుక దోపిడీ చేస్తున్న ప్రజాప్రతినిధులు

కలెక్టర్, ఎస్పీలకు అక్రమ రవాణా కన్పించడం లేదా?

నాలుగు నెలలుగా భవన నిర్మాణ రంగం నిర్వీర్యం

ఇసుక దోపిడీలో అధికార యంత్రాంగం భాగస్వామ్యం

జిల్లా అంతటికీ ఒక స్టాక్‌ పాయింట్‌ పెట్టడం ఏంటి?

మద్యం పాలసీతోనూ టీడీపీ నేతలకే లబ్ధి

దరఖాస్తుదారులను బెదిరిస్తున్న పరిస్థితి

ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా పట్టించుకోరా?

చంద్రబాబు, లోకేష్‌కు ఏమైనా వాటాలు అందుతున్నాయా?

ఎవర్నీ కంట్రోల్‌ చేయలేని పరిస్థితిలో సీఎం చంద్రబాబు

ప్రతి గ్రామంలో బెల్టు షాపుల ఏర్పాటుకు రంగం సిద్ధం

వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఫైర్‌

మనస్సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఉన్న సంపదను టీడీపీ నేతలకు కట్టబెడుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఇసుక దోపిడీ జరుగుతున్నా, మద్యం పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, లోకేష్‌కు ఇందులో వాటాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌తో పాటు ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పారు. నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామన్నారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని ఊదరగొట్టారు. కానీ ఈ రోజు ఏం జరుగుతోందో ప్రజలు ఆలోచించాలి. భవన నిర్మాణ రంగంపై రాష్ట్రంలో 60 లక్షల మంది ఆధారపడ్డారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల నాలుగు నెలల్లో నిర్మాణ రంగం కుదేలైంది. ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి రోజు నుంచే ఇసుకను దోపిడీ చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం దేవుడెరుగు.. ఉన్న సంపదను అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారికి మాత్రమే సంపద సృష్టించారు. జిల్లాలో ఇసుకను ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నా నియంత్రించలేని పరిస్థితి ఉంది. నిత్యం ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లోనే ఇసుక తరలిపోతోంది. చంద్రబాబు గానీ, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్న లోకేష్‌కు గానీ ఇసుక దోపిడీ కనిపించడం లేదా? ప్రముఖ పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో ఇసుక దోపిడీపై కథనాలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో నదీపరివాహక ప్రాంతాల్లోని ఇసుకనంతా తోడేస్తున్నారు. పెద్ద ఎత్తున టిప్పర్లతో ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఉచిత ఇసుక అభాసుపాలైందని సీఎం చంద్రబాబు సీరియస్‌ అయినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మీకు తెలియకుండానే ఇసుక తరలిపోతోందా? పెన్నా, చిత్రావతి, వేదవతి హగరి, కుషావతి, పాపాగ్ని నదీపరివాహ ప్రాంతాల్లో ఇసుక దోపిడీ జరుగుతోంది. ప్రతి గ్రామం వద్ద జేసీబీలు, ఇటాచీలు పెట్టుకుని నిత్యం వందల సంఖ్యలో తరలిస్తుంటే అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. స్టేట్‌మెంట్లకు మాత్రమే నేనూ, మీరే పరిమితం కావాలని కలెక్టర్, ఎస్పీలకు సీఎం చంద్రబాబు చెప్పారా? మీకు చేతకాకుంటే నా వద్దకు వస్తే.. ఎక్కడి నుంచి ఇసుక తరలిపోతోందో చెబుతా..! రాయదుర్గం, కళ్యాణదుర్గం,  తాడిపత్రి, గుంతకల్లు, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే దోపిడీ జరుగుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఆదాయం వచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి కూడా లేదు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. గతంలో రూ.15 వేలకు దొరికే ఇసుక ఈ రోజు రూ.22 వేలకు వస్తున్న పరిస్థితి. ఎప్పుడైనా పత్రికల్లో కథనాలు వస్తే ఎద్దుల బండ్లను మాత్రమే పట్టుకుని స్టేషన్లలో పెడుతున్నారు. టిప్పర్లు కనిపించడం లేదా? ఇసుక దోపిడీ వ్యవహారంలో పోలీసులు, రెవన్యూ అధికారులు భాగస్వామ్యం అయ్యారు. స్టేషన్‌కు ఇంత అని వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలో ఇంతలా జరుగుతున్న ఇసుక దోపిడీ గురించి సీఎం చంద్రబాబుకు తెలియదా? చివరకు ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా బెదిరించే పరిస్థితికి వచ్చారు. మేం గెలవకపోతే మీరు ముఖ్యమంత్రి అయ్యేవారా? అని చెప్పే పరిస్థితి వచ్చింది. టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక దోపిడీ చేస్తూ ఛాలెంజ్‌లు విసురుతున్నా కిమ్మకున్నారు. దీనికి కారణం ఏంటి? మీకు చేతకావడం లేదా? ఎమ్మెల్యేలు మీ కంట్రోల్‌లో లేరా? మీకూ వాళ్లకు ఏమైనా అగ్రిమెంట్‌ ఉందా? ప్రతి టిప్పర్‌ నుంచి పర్సంటేజీ ఏమైనా తండ్రీకొడుకులకు వస్తోందా? అని అడుగుతున్నా. జిల్లా సరిహద్దులోని కడప జిల్లా ఏటూరు నుంచి అనంతపురం జిల్లా కేంద్రానికి నిత్యం టిప్పర్లలో ఇసుక వస్తోంది. సుమారు రూ.24 వేల నుంచి రూ.27 వేల వరకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులను నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.

మద్యం పాలసీలో ఏం జరుగుతోందో తెలుసా?

మద్యం పాలసీలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని ఓటు వేసిన మేథావులను సైతం ఆశ్చర్యపరిచేలా ప్రతి ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నారు. దరఖాస్తు చేసుకుంటే వ్యాపారాలు చేసుకోలేరని అంటున్నారు. ఏకంగా సీఐలు, డీఎస్పీలే ఫోన్లు చేస్తున్నారు. మద్యం షాపులకు డీడీలు కట్టి వేసుకుంటే మంచిది కాదని, స్టేషన్లకు రావాలని పిలుపులు వస్తున్నాయి. 2019 కన్నా ముందు కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా వచ్చి మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పడా పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది డీడీలు కడతారనుకుంటే ఇప్పటి వరకు 50 వేల మంది కూడా వేయలేదు. అందరూ కలిసి సిండికేట్‌గా మారారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎస్పీ, కలెక్టర్లు ప్రభుత్వానికి చెప్పడం లేదా? రాష్ట్రాన్ని దోపిడీ చేయాలని అనుకుంటున్నారా? ఇదేనా చంద్రబాబు అనుభవం? ఇదెక్కడి సంస్కృతి. ఎవర్నీ కంట్రోల్‌ చేయలేరా? కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతరులు వ్యాపారాలు, కాంట్రాక్టర్లు కూడా చేసుకోలేని పరిస్థితి. పరిస్థితి ఇలాగే ఉంటే  వైసీపీనే ప్రజల పక్షాన నిలబడాల్సి వస్తుంది. ఎస్పీ, కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్లు మద్యం, ఇసుక విషయంలో నిష్పక్షపాతంగా ఉండండి. కేవలం ప్రకటనలకు పరిమితం కావద్దు. సిండికేట్‌ వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా కొంత మంది ప్రజాప్రతినిధుల చేతుల్లోకి అక్రమ సంపాదన చేరుతోంది. ఇసుకకు సంబంధించి జిల్లా అంతా ఒక స్టాక్‌ పాయింట్‌ పెట్టడం ఏంటి? వాస్తవానికి ఇసుక కొరతను ప్రజాప్రతినిధులే సృష్టిస్తూ ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించేస్తున్నారు. గతంలో ఇసుక అక్రమ తవ్వాకాలు జరుగుతున్నాయని కొందరు ఎన్జీటీకి వెళ్లారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఇసుక దోపిడీ జరుగుతోంది.  జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎంతగా బరితెగుస్తున్నారంటే.. చివరకు మద్యం షాపుల వద్ద అమ్ముకునే తినుబండారాల విషయంలో కూడా గుత్తాధిపత్యం ఇస్తామంటున్న పరిస్థితి. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉందా? బెల్టు షాపుల ఏర్పాటుకూ రంగం సిద్ధమవుతోంది.

ఉమ్మడి అనంతలో 223 ప్రైవేట్‌ మద్యం షాపులు
గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన అధికారులు

నాన్‌ రీఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 2 లక్షలు

ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

11వ తేదీన అనంతపురం, పుట్టపర్తిలో లక్కీ డ్రా

వైసీపీ హయాంలో 192 ప్రభుత్వ మద్యం షాపులు

తాజాగా 31 దుకాణాలను పెంచిన ప్రభుత్వం

మనస్సాక్షి ప్రతినిధి, అనంతపురం : మందుబాబులకు కిక్‌ ఎక్కించేందుకు చంద్ర బాబు సర్కార్‌ సిద్ధమైంది. ప్రైవేట్‌ మద్యం టెండర్ల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి.  ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 192 మద్యం షాపులను ఏర్పాటు చేసి ప్రభుత్వమే నిర్వహించింది. తాజాగా కూటమి ప్రభుత్వం మరో 31 దుకాణాలను పెంచింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 223 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. నూతన ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం అనంతపురం జిల్లాలో 136, శ్రీ సత్యసాయి జిల్లాలో 87 మద్యం షాపులు రానున్నాయి. ఇందుకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ను అనంత పురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు రామ్మోహన్‌రెడ్డి, గోవింద నాయక్‌లు వేర్వేరుగా మంగళవారం విడుదల చేశారు. అనంతపురం జిల్లాకు సంబంధించి అత్యధికంగా అనంత పురం కార్పొరేషన్‌ పరిధిలో 30 దుకాణాలు ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి ధర్మవరం మునిసిపాలిటీ పరిధిలో 10 షాపులు ఉన్నాయి.

రూ.2 లక్షలు నాన్‌ రీఫండబుల్‌

మద్యం టెండర్లకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య వెల్లడిరచారు. షాపుల లైసెన్సు కోసం లాటరీ పద్ధతి చేపట్టనున్న నేపథ్యంలో రూ.2 లక్షల నాన్‌ రిఫండబల్‌ రిజస్ట్రేషన్‌ ఫీజుతో దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఆన్‌లైన్‌, హై బ్రిడ్‌, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో దరఖాస్తులు స్వీకరించ నున్నారు. ఏ జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తు చేస్తారో ఆ జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి పేరు మీద రూ.2 లక్షల డీడీ తీయాల్సి ఉంటుంది. ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 11వ తేదీన అనంతపురం జిల్లాకు సంబంధించి మద్యం దుకాణాలకు అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో, శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తిలోని సాయి ఆరామం ఫంక్షన్‌ హాల్‌లో లాటరీ తీయనున్నారు. లక్కీ డ్రాలో ఎంపికైన వారు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌లో 1/6 వంతు చెల్లించి మద్యం దుకాణాలను అక్టోబర్‌ 12వ తేదీ నుంచి ప్రారంభించవచ్చు. జనాభా ప్రాతిపదికన వైన్‌షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. పదివేలు జనాభా ఉన్న చోట రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేలు ఉన్న చోట రూ.55 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షలు జనాభా వరకు రూ.65 లక్షలు, 5 లక్షలకుపైన ఉన్నచోట రూ.85 లక్షలు లైసెన్స్‌ ఫీజుగా నిర్ణయించారు. రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ శ్లాబ్‌కు సంబంధించి  ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని దుకాణాలు రూ.55 లక్షలు, రూ.65 లక్షలుగా నిర్ణయించారు. టెండర్‌ దక్కించుకున్న వారు మద్యం దుకాణాలను రెండేళ్ల కాల వ్యవధి వరకు నిర్వహించుకోవచ్చు.

మండల స్థాయిలో 133 దుకాణాలు

మద్యం షాపులకు సంబంధించి మునిసిపల్‌ కార్పొరేషన్‌, మునిసిపాలిటీ, నగర పంచా యతీ, మండల స్థాయిగా యూనిట్లు విభజించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మండల స్థాయిలోనే అత్యధికంగా 133 ప్రైవేట్‌ మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఏర్పాటు కానున్న  136 షాపుల్లో  కార్పొరేషన్‌ పరిధిలో 30, మునిసిపాలిటీల పరిధిలో 32, మండల స్థాయిలో 74 దుకాణాలు రానున్నాయి. ఇక శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి మొత్తంగా 87 దుకాణాలు ఏర్పాటు కానుండగా మునిసిపాలిటీల పరిధిలో 22, నగర పంచాయతీ పరిధిలో 6, మండల స్థాయిలో 59 దుకాణాలు రానున్నాయి.

అప్లికేషన్‌ ఎక్కడ ఇవ్వాలి?

అనంతపురం జిల్లాకు సంబంధించి టెండర్‌ దారులు అనంతపురం, బుక్కరాయసముద్రం, గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, కణేకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, కంబదూరులో ఉన్న ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్లలో దరఖాస్తులు అందజేయవచ్చు. శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తి, ధర్మవరం, సీకే పల్లి, పెనుకొండ, హిందూపురం, కదిరి, మడకశిర, తనకల్లులోని  ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్లలో అప్లికేషన్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.

ఏపీ ఎన్నికలపై ఆరా మస్తాన్‌ సర్వే
94 నుంచి 104 స్థానాల్లో వైసీపీ విజయం

71 నుంచి 81 స్థానాల్లో కూటమి గెలుపు

కడపలో డిపాజిట్‌ కోల్పోనున్న వైఎస్‌ షర్మిల

మనస్సాక్షి డెస్క్‌ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన ఆరా మస్తాన్‌ ఏర్పాటు చేసిన ‘ఆరా పోల్‌ స్ట్రాటజీస్‌’ తన ఫలితాలు విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారనే విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించడంలో ఈ సంస్థకు మంచి  పేరుంది. క్షేత్రస్థాయిలో బలమైన నెట్‌ వర్క్‌ ఉన్న ఆరా మస్తాన్‌.. గ్రౌండ్‌ లెవిల్లో.. ప్రతి విషయాన్నీ అంచనా వేయడంలో ముందుంటారు. ఏ పార్టీ గెలుస్తుందనే విషయంతో పాటు నాయకుల గెలుపును కూడా అంచనా వేయడంలో ‘ఆరా’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆరా మస్తాన్‌ వెల్లడిరచారు. 49.61 శాతం ఓట్లతో 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనున్నట్లు వివరించారు. ఇక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 47.55 శాతం ఓట్లతో 71 నుంచి 81 స్థానాలకు పరిమితం కానున్నట్లు స్పష్టం చేశారు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 3.04 శాతం ఓట్లు సాధించనున్నట్లు ప్రకటించారు.

ఇక పార్లమెంట్‌ స్థానాలకు సంబంధించి 25 ఎంపీలకు గాను 13 నుంచి 17 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ప్రకటించారు. ఎంపీ స్థానాల్లో 48.29 శాతం ఓట్లు వైసీపీ సాధించనుంది. ఇక ఎన్డీఏ కూటమి 47.68 శాతం ఓట్లతో 10 నుంచి 12 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్‌ వెల్లడిరచారు. అదేవిధంగా 4.03 శాతం ఓట్లు కాంగ్రెస్‌, ఇతర పార్టీలు, స్వతంత్రులకు పడినట్లు స్పష్టం చేశారు. ఏపీలోని పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ 3 శాతం ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ మూడు ఎంపీ స్థానాలు కోల్పోనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీకి ఓటు వేసిన ఓటర్లు.. ఎంపీ విషయంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓటు వేయడం వల్ల వైసీపీకి పార్లమెంట్‌ స్థానాల్లో నష్టం జరగనున్నట్లు వెల్లడిరచారు. ఇక కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్‌ షర్మిలకు డిపాజిట్‌ కూడా దక్కదని ఆరా మస్తాన్‌ వెల్లడిరచారు. ఇదిలావుండగా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్‌ సర్వే చేసి ఎగ్జిట్‌ పోల్‌ విడుదల చేశారు. ఇందులో వైసీపీకి 119 నుంచి 126 అసెంబ్లీ స్థానాలు.. టీడీపీకి 47 నుంచి 56 స్థానాలు వస్తాయని అంచనా  వేయగా.. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితం అయ్యింది.

పరిటాల శ్రీరాంకు లైన్‌ క్లియర్‌..!
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో క్యాడర్‌ కూడా పని చేస్తోంది. అటు అధినేత చంద్రబాబు.. ఇటు యువనేత నారా లోకేష్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచాలని లోకేష్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలోలా ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించకుండా.. ముందు నుంచే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తు రాజకీయాలు ఉంటాయన్న ఊహాగానాలు ఓ వైపు ఉండగానే నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో పలుచోట్ల అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర ముగియగా ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే అక్కడ అభ్యర్థులను నారా లోకేష్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌, పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. సత్యవేడులో హెలెన్‌, నగరిలో భాను ప్రకాష్‌, చంద్రగిరిలో పులివర్తి నాని, పీలేరులో నల్లారి కిశోష్‌కుమార్‌రెడ్డిలను గెలిపించాలని నారా లోకేష్‌ సూచనప్రాయంగా క్యాడర్‌కు సూచించారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతుండగా..రాప్తాడు నియోజకవర్గంలోకి లోకేష్‌ మరోసారి సోమవారం అడుగుపెట్టనున్నారు.

కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరిన నారా లోకేష్‌.. ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం భిన్నంగా ప్రసంగం కొనసాగించారు. ఆదివారం బత్తలపల్లిలో జరిగిన సభలో లోకేష్‌ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరాం పేరును దాదాపు ఖరారు చేసినట్లు స్పష్టమవుతోంది. తన ప్రసంగంలో పరిటాల శ్రీరాంను ప్రజలు, క్యాడర్‌కు చూపిస్తూ నారా లోకేష్‌ ఏమన్నారంటే.. ‘‘ఒక యువకుడున్నాడిక్కడ.. ఉత్సాహవంతుడున్నాడు.. కష్టపడే మనస్తత్వం ఉంది. నా పాదయాత్ర అయినాక మీ దగ్గరకు వస్తాడు. ఆశీర్వదించండి..దీవించండి..కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలకు విజ్ఞప్తి. ఎవరూ భయపడొద్దు. 20 కేసులు నా మీద పెట్టారు. అటెంప్ట్‌ మర్డర్‌ ఉంది. ఎస్సీ, ఎస్టీ కేసుంది. కానీ తగ్గేదే లేదు’’ అని తెలియజేశారు. లోకేష్‌ ఇలా వ్యాఖ్యానించడంతో ధర్మవరం టీడీపీలో కొత్త జోష్‌ వచ్చింది.

బత్తలపల్లిలో జరిగిన సభలో లోకేష్‌ ప్రసంగం VIDEO

ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున పరిటాల శ్రీరాం పోటీలో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు తొలగిపోయాయి. కష్టకాలంలో పార్టీకి, క్యాడర్‌కు అండగా ఉన్న శ్రీరాం వైపే టీడీపీ అధినేత చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి.. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో డీలా పడిన తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు పరిటాల శ్రీరాం అండగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే వరదాపురం సూరి బీజేపీని వీడి టీడీపీలోకి చేరుతారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో పరిటాల శ్రీరాంకు ధర్మవరం నుంచి లైన్‌ క్లియర్‌ అయిందని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి :  ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌ నిర్మించుకున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్‌ ట్రాక్‌, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు.

‘‘ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట పైన ఉన్న 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాజేశారు. ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించారు. హైదరాబాదుకు చెందిన ఓ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి సదరు సర్వేనెంబర్‌ పై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారుచేశారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వాటిని వేలంలో తమ కుటుంబ సభ్యులు కొన్నట్లు రికార్డులు తయారుచేసి భూములను కొట్టేశారు. ఎర్రగుట్టపై మరో 5 ఎకరాలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారు. ఇవి పిత్రార్జితంగా ఆమెకు సంక్రమించినట్లు రికార్డుల్లో చూపారు. అయితే సదరు కుటుంబ సభ్యురాలిది కర్నూలు జిల్లా కాగా ఇక్కడికి ఇచ్చి వివాహం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ఇక్కడ గుట్టపై భూమి ఎలా సంక్రమించింది? ఎర్రగుట్టపై ఉన్న సర్వే నంబర్లకు సంబంధించి రికార్డులు సమర్పించాలని ఆర్‌.టి.ఐ ద్వారా అడగగా వాటికి సంబంధించిన రికార్డులు లేవంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారు. రికార్డుల్లో లేని భూమి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుతో ఎలా నమోదు అయింది? అలాగే పోతుల నాగేపల్లి పరిధిలోని 42, 43 సర్వే నెంబర్లలో అసైన్డ్‌ భూములను రైతులను బెదిరించి లాక్కోవాలని ప్రయత్నించారు. ఈ విషయం ఎస్సీ కమిషన్‌ వరకు వెళ్లడంతో అప్పటి కలెక్టర్‌ గంధం చంద్రుడు అడ్డుకున్నారు. అందుకే ఆయనపై కక్ష పెంచుకుని ఇక్కడి నుంచి బదిలీ చేయించారు. తెదేపా అధికారంలోకి రాగానే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ అక్రమాలతో పాటు రాష్ట్రంలోని వైకాపా ఎమ్మెల్యేలందరి అవినీతిపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం’’ అని నారా లోకేష్‌ పేర్కొన్నారు.

అవినీతి అనకొండ.. శంకర నారాయణ
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి :  మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ టార్గెట్‌గా టీడీపీ యువనేత నారా లోకేష్‌ విమర్శనాస్త్రం సంధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర నారాయణతో పాటు ఆయన సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. శంకరనారాయణ అవినీతి అనకొండ అని అభివర్ణించారు. సోమవారం పెనుకొండ నియోజకవర్గంలోని గుమ్మయ్యగారిపల్లి బహిరంగసభలో నారా లోకేష్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘పెనుకొండ లో ఒక అవినీతి అనకొండ ఉంది. పేరు శంకర్‌ నారాయణ. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే మాకొద్దీ అవినీతి అనకొండ అంటూ ధర్నాలు చేస్తున్నారు అంటే ఆయన దోపిడీ ఏ రేంజ్‌ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ లేఅవుట్‌ వేసినా.. వారినుంచి ఎమ్మెల్యే శంకర్నారాయణ ఎకరాకు 10 లక్షలు వసూలు చేస్తున్నాడు. పెన్నానది నుంచి రోజుకు 100 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇసుకను బెంగళూరుకు  తరలించి రోజుకు ఐదు నుంచి పది లక్షలు జేబులో వేసుకుంటున్నాడు. దొంగ వే బిల్లులు సృష్టించి కర్ణాటక నుంచి ప్రతి రోజు నకిలీమద్యం, డీజిల్‌ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడు.  కర్ణాటక డిజిల్‌ విక్రయిస్తూ రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. మూడేళ్లపాటు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు.  మంత్రిగా పనిచేసిన మూడేళ్లలో రాష్ట్రంలో ఒక రోడ్డు కూడా వేయలేదు. సొంత నియోజకవర్గంలో గుంతలు పడినా రోడ్లను రిపేర్‌ కూడా చేయని మంత్రిగా పేరు గడిరచాడు. రాష్ట్ర చరిత్రలో ఒక రోడ్డు కూడా వేయకుండా మూడేళ్లపాటు రోడ్ల మంత్రిగా పనిచేసిన మంత్రిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ఇవ్వాలి.తాను సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడు. పెనుకొండ లో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అవినీతి అనకొండ ఇంద్ర భవనానికి మాత్రం డ్రైనేజ్‌ ఏర్పాటు చేసుకున్నారు. కియా కార్మికుల శ్రమని కూడా దోచుకుంటున్నారు శంకరనారాయణ. ఎమ్మెల్యే శంకర్నారాయణ బినామీ ఏజెన్సీల ద్వారా కియా పరిశ్రమకు లేబర్‌ ను అందిస్తున్నారు. అయితే కియా కంపెనీ వాళ్లు ఒక్కో లేబర్‌ కు రోజుకు 800 ఇస్తుండగా ఈయన మాత్రం 400 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాడు. అంటే ఒక్కో కార్మికుడి నుంచి నెలకు 12 వేల రూపాయలు దోచుకుంటున్నాడు. టిడిపి ప్రభుత్వం కియా పరిశ్రమ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తే ఆ ఉద్యోగుల నుంచి వైకాపా నాయకులు దోచుకుంటున్నారు.టిడిపి ప్రభుత్వం కియా పరిశ్రమను ఏర్పాటు చేసినప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యతిరేకించారు. రైతుల నుంచి తీసుకున్న భూములను వెనక్కు ఇప్పిస్తామని రెచ్చగొట్టాడు. ఇప్పుడు అదే కియా పరిశ్రమలో ఎమ్మెల్యే శంకర్నారాయణ, తమ్ముళ్లు కాంట్రాక్ట్‌ పనులు చేసుకుంటున్నారు. కీయాలో క్యాంటీన్‌ దగ్గర నుంచి స్క్రాప్‌ కాంట్రాక్ట్లు అన్ని బెదిరించి మరీ లాక్కున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కియా అనుబంధం పరిశ్రమల కోసం ధర్నా అంటూ హై డ్రామా ప్లే చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు కమిషన్లు ఇచ్చుకోలేక వంద అనుబంధ సంస్థలు తమిళనాడుకు వెళ్ళిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అనుబంధ సంస్థలు మొత్తం పరిశ్రమలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండేవి. ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ నియోజకవర్గంలోని ఒక్కొక్క మండలానికి ఒక తమ్ముడిని ఇన్చార్జిగా నిర్మించి సామంత రాజులను చేశాడు. వాళ్లు నిత్యం భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటివరకు వందల ఎకరాలను కాజేశారు.శంకర్‌ నారాయణ ఆయన తమ్ముళ్ళ అవినీతిపై వైసిపి నేతలే ప్రశ్నిస్తున్నారు. అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. ప్రశ్నించిన వైసిపి నాయకుల్ని పోలీస్‌ స్టేషన్లో పెట్టి కొట్టిస్తున్నాడు. పేదలకి ఇళ్ళ స్థలాలు, పక్కా ఇళ్ళ నిర్మాణం పేరుతో రూ.250 కోట్లు కొట్టేశారు శంకర్‌ నారాయణ అండ్‌ బ్రదర్స్‌.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కియా అనుబంధ సంస్థలు అన్ని తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తాం. లేపాక్షి భూములు వెనక్కి తీసుకోని పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం.హంద్రీనీవా పూర్తి చేసి నియోజకవర్గం లో సాగు, త్రాగు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా. పెనుకొండ ను అభివృద్ది చేసింది టిడిపి. ఇక్కడ వేసిన రోడ్లు, త్రాగునీరు ప్రాజెక్టులు అన్ని మా హయాంలో చేసినవే. వైసిపి వచ్చాకా దోచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు.పెనుకొండ మళ్ళీ అభివృద్ది బాట పట్టాలి అంటే టిడిపి ని గెలిపించండి.ఉమ్మడి అనంతపురం జిల్లా మా కుటుంబాన్ని ఆదరించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో కంటే రెట్టింపు అభివృద్ది చేస్తాం. అన్న ఎన్టీఆర్‌, ముద్దుల మావయ్యను అభిమానించి గెలిపించిన జిల్లా అనంతపురం. రాబోయే ఎన్నికల్లో టిడిపిని గెలిపించండి. అభివృద్ధి చేసి చూపిస్తాం’’ అని నారా లోకేష్‌ తెలిపారు.

పెనుకొండకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

‘‘ఇక్కడో ఎంపి ఉన్నాడు. సమస్యలపై పోరాడాలని ప్రజలు డిల్లీ పంపిస్తే బట్టలు విప్పుకుని తిరుగుతున్నాడు. ఒక్క సమస్య గురించి కూడా ఆయన డిల్లీలో పోరాడలేదు’’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఉద్దేశించి నారా లోకేష్‌ అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుకొండ నియోజకవర్గం వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా గోరంట్ల మండలానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు. టిడిపి గెలిచిన వెంటనే పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. పెనుగొండ నియోజకవర్గం లో కురుబ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఇక్కడ  గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. రెండున్నర సంవత్సరాల కిందట ఇక్కడ  గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న శంకర్‌ నారాయణ దీని గురించి పట్టించుకోలేదు. ఇప్పటివరకు గొర్రెపిల్లని ఇచ్చిన పాపాన పోలేదు. గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం కోసం మంజూరు చేసామని చెప్పిన రెండు కోట్ల రూపాయలు ఏమయ్యాయో ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ సమాధానం చెప్పాలి.పెనుగొండ కేంద్రంగా మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తామని స్వయంగా సీఎం జగన్‌ రెండేళ్ల  క్రిందట ప్రకటించారు. రెండేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశాడు. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. రాష్ట్రవ్యాప్తంగా 14 మెడికల్‌ కాలేజీలు పెడతామని నాలుగేళ్లుగా మాటలు చెబుతున్నారు తప్ప పునాదిరాయి వేసింది లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మెడికల్‌ కళాశాల నిర్మాణం పూర్తిచేస్తాం అని నారా లోకేష్‌ తెలిపారు.

మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ను గాలికొదిలేశారు!

టిడిపి హయాంలో మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ 90 శాతం పూర్తి చేసి మడకశిరలోని చెరువుకు నీరు అందించాం. అక్కడక్కడ బ్రిడ్జిలు, కల్వర్టులకు సంబంధించిన పనులు మాత్రమే పెండిరగ్లో ఉన్నాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ను గాలికి వదిలేసింది. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా  పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే కాలువను పూర్తి చేసి మడకశిరలోని 100 చెరువులకు నీరు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన జగన్‌..ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు..బ్రాంచ్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తి  చేయకుండా.. ఇప్పుడు బైపాస్‌ కెనాల్‌ నిర్మిస్తామని కొత్త మాట చెబుతున్నాడు. ఉన్నదాన్ని పూర్తి చేయలేని వాడు కొత్త కాలువ నిర్మిస్తానని చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. బైపాస్‌ కెనాల్‌ నిర్మాణంపై ప్రకటన చేసి రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఒక్క గంప మట్టి అయినా తీశారా? అని లోకేష్‌ ప్రశ్నించారు. బహిరంగ సభలో టీడీపీ నేతలు పార్థసారధి, సవితమ్మ, నిమ్మల కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కాదు.. దోపిడీకుంట శ్రీధర్‌ రెడ్డి..!
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి :  పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆయన దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కాదు.. దోపిడీకుంట శ్రీధర్‌ రెడ్డి అని అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని ఒడిసి రెయిన్‌ బో ఎడ్యుకేషన్‌ అకాడమీ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్‌ మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలను తూర్పారబట్టారు. లోకేష్‌ ఏమన్నారంటే.. ‘పుట్టపర్తి ఎమ్మెల్యే పేరు దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి. ఆయన ప్రజా ధనం దోపిడీ లో దిట్ట. అందుకే ఆయన పేరు మార్చాను. దోపిడీకుంట శ్రీధర్‌ రెడ్డి. దోపిడీకుంట శ్రీధర్‌ రెడ్డి, ఆయన అనుచరులు కలిసి ఆధ్యాత్మిక కేంద్రాన్ని అరాచక కేంద్రంగా మార్చేశారు. పుట్టపర్తిలో ఓ బిల్డర్‌ ను బెదిరించి కోటిన్నర రూపాయలు వసూలు చేశారు. ఓడీసీ మండలంలో టీచర్లంతా కలిసి ఏర్పాటు చేసుకున్న లేఅవుట్‌ కోసం కోటి రూపాయలు తీసుకున్నారు. కొత్తచెరువు వద్ద ఓ లేఅవుట్‌ కు దారి కోసం నిర్మించిన బ్రిడ్జి అనుమతి కోసం 75 లక్షలు వసూలు చేశారు. పుట్టపర్తిలో ఈ ఎమ్మెల్యే చేసిన అరాచాకాలు, అక్రమాలు చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేస్తారని ముందుగానే తెలుసుకుని టౌన్‌ చుట్టుపక్కల అతి తక్కువ ధరకు వందల ఎకరాలు కొన్నారు. ఇది కదా అసలైన క్విడ్‌ ప్రోకో అంటే.. పుట్టపర్తి చుట్టుముట్టు ఈయన కొనడమే కాదు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేతో కూడా వందల ఎకరాలు కొనుగోలు చేయించారు. భూ వివాదాలు వీరే సృష్టిస్తారు. తర్వాత వాటిని పరిష్కరించినట్టు కలరింగ్‌ ఇచ్చి కమీషన్‌ రూపంలో లక్షలు కొట్టేస్తారు. నాలుగేళ్లలో వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. ఇక్కడ సంపాదించిన డబ్బును తీసుకెళ్లి బెంగళూరు, హైదరాబాద్‌ లో పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తూ అవే లారీల్లో కర్నాటక నుంచి నకిలీ మద్యం, డీజిల్‌ దిగుమతి చేసుకుంటూ రెండుచేతులా సంపాదిస్తున్నారు. బినామీలను ముందు పెట్టి ప్రతి రోజు రేషన్‌ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. మిల్లుల వ్యాపారులతో కుమ్మక్కై దందా చేస్తున్నారు. ఇక్కడ రేషన్‌ బియ్యాన్ని కర్ణాటకలో పాలిష్‌ చేసి సన్నబియ్యంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు.

పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 193 చెరువులకు నీరిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు దాని ఊసే ఎత్తలేదు. రెండేళ్ల కిందట ఓ జీవో విడుదల చేశారు. 864 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు.  ఆ రోజు ఇక్కడి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి చేసిన హడావిడి మాములుగా లేదు. కొన్ని లక్షలు ఖర్చుచేసి పెద్ద ర్యాలీ చేశారు. ఇక ప్రాజెక్టు కట్టేసినట్లే అని ప్రజలంతా అనుకున్నారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. జగన్‌ రెడ్డి పుట్టపర్తికి వచ్చినపుడు మరో హామీ కూడా ఇచ్చారు. పుట్టపర్తిని అధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగా కూడా డెవలప్‌ చేస్తానన్నారు. చిత్రావతిలో, బుక్కపట్నం చెరువులో బోటింగ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తికి వచ్చింది లేదు.. నిధులు ఇచ్చింది లేదు. పైగా ఈ వైసిపి బ్యాచ్‌ పుట్టపర్తిలో ఉన్న ప్రశాంతతను, అందాన్ని కూడా చెడగొట్టారు.  బుక్కపట్నం మండలంలోని మారాల జలాశయాన్ని 0.5 టీఎంసీల కెపాసిటీతో 2018లోనే చంద్రబాబునాయుడు పూర్తి చేశారు.  పాదయాత్రలో భాగంగా మారాల వచ్చిన జగన్‌ రెడ్డి కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. నాలుగేళ్లు గడిచిపోయింది. ఇప్పటివరకు ఒక్క పని కూడా మొదలుపెట్టలేదు.  మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకునే జగన్‌ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.

పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రధాన సమస్య స్థానికంగా ఉపాధి అవకాశలు లేకపోవడం. ఓడీసీ, నల్లమాడ, అమడగూరు మండలాల నుంచి పెద్దఎత్తున కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇక్కడి నుండి కేరళకు వెళ్లిన కొందరు అక్కడ బిక్షాటన చేసి బతుకుతున్న దౌర్భాగ్యం. ఈ పరిస్థితి మారాలంటే నియోజకవర్గంలో పెద్దఎత్తున పరిశ్రమలు రావాలి. టిడిపి అధికారంలోకి రాగానే పుట్టపర్తి చుట్టూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తాం. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి లేకుండా చేస్తాం. పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని రకాల పంటలు పండిరచేందుకు అనువైన భూములు ఉన్నాయి. అయితే సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాన్ని జగన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హంద్రీనీవా ద్వారా చెరువు నింపి ఉంటే రైతులు బాగుపడేవారు. అయితే పైనున్న జగన్‌ రెడ్డికి, ఇక్కడున్న ఎమ్మెల్యేకు వారి స్వప్రయోజనాలు తప్ప జనాల గురించి పట్టదు. టిడిపి హయాంలోనే రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద చెరువైన బుక్కపట్నం చెరువుకు నీరిచ్చాం. హంద్రీనీవా ప్రధాన కాలువ పూర్తి చేశాం. మళ్లీ అధికారంలోకి రాగానే పెండిరగ్‌ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పుట్టపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇస్తున్నా. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసి ఏడాది కావొస్తోంది. సత్యసాయి ట్రస్టు పుణ్యమా అని బిల్డింగులన్ని ఉచితంగా వచ్చేశాయి. కానీ జిల్లా కేంద్రంలో ఏ ఒక్క డిపార్ట్‌ మెంట్లోనూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. చాలా డిపార్ట్‌ మెంట్లలో ఇంటర్నెట్‌ ఫెసిలిటీ కూడా లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పిస్తాం’’ అని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.

తెలుగుదేశం డిక్లరేషన్‌ డ్రామా..!
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ తర్వాత తెలుగుదేశం పార్టీ డిక్లరేషన్‌ డ్రామా రక్తికట్టించింది. ఎన్నికల నిబంధనలు స్పష్టంగా తెలిసినా ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయంగా లబ్ధిపొందడమే లక్ష్యంగా ముందుకు సాగి సఫలీకృతమైంది. కౌంటింగ్‌ ప్రారంభం నుంచి మీడియా అటెన్షన్‌ అంతా తమమీదే ఉంచుకుంది. అనంతపురం జేఎన్‌టీయూ కేంద్రంలో ఏదో జరిగిపోతోందంటూ బయటి ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చేసింది. టీడీపీ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో అధికార పార్టీ విఫలం కావడం ఒక ఎత్తయితే.. డిక్లరేషన్‌ విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయో ఎప్పటికప్పుడు తెలియజేయడంలో అధికార యంత్రాంగం కూడా పట్టనట్టు వ్యవహరించింది.

సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్‌ ప్రక్రియ

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార వైసీపీ నుంచి వెన్నపూస రవీంద్రారెడ్డి, ప్రతిపక్ష టీడీపీ నుంచి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి, బీజేపీ నుంచి రాఘవేంద్ర, పీడీఎఫ్‌ మద్దతుతో పోతుల నాగరాజు పోటీ చేశారు. మొత్తం 2,45,687 ఓట్లు పోలయ్యాయి. 19,239 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. 2,26,448 ఓట్లు వాలిడ్‌ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలవాలన్నా 50 శాతానికి ఒక ఓటు అదనంగా రావాల్సి ఉంటుంది. అంటే 1,13,225 ఓట్లు ఎవరికి వస్తే వాళ్లు విజేత అని ప్రకటించి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఈ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. గురువారం (మార్చి 16వ తేదీ) ఉదయం 8 గంటల నుంచి శనివారం (మార్చి 18వ తేదీ) రాత్రి 8 గంటల వరకు కౌంటింగ్‌ చేపట్టారు.

ఎమ్మెల్సీగా తొలి ప్రాధాన్యత వెన్నపూస రవీంద్రారెడ్డికే

కౌంటింగ్‌ సందర్భంగా ముందుగా అభ్యర్థులకు వచ్చిన తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి మెజార్టీ సాధించారు. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డికి 94149 ఓట్లు రాగా వెన్నపూసకు 95965 ఓట్లు వచ్చాయి. టీడీపీ కన్నా వైసీపీ 1820 ఓట్ల మెజార్టీ సాధించింది. బీజేపీ అభ్యర్థి రాఘవేంద్రకు 7412 ఓట్లు, పీడీఎఫ్‌ బలపరచిన నాగరాజుకు 18758 ఓట్లు వచ్చాయి. పట్టభద్రులు ఎమ్మెల్సీగా తొలి ప్రాధాన్యతను వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికే ఇచ్చారు.

45 మంది ఎలిమినేట్‌ అయినా వైసీపీదే ఆధిక్యం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతగా ప్రకటించాలంటే కావాల్సిన 1,13,225 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తొలి ప్రాధాన్యతలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఒక్కొక్కరుగా ఎలిమినేట్‌ చేస్తూ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 49 మంది అభ్యర్థులు పోటీ చేయగా 45 మంది ఎలిమినేట్‌ అయిపోయాక కూడా వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధిక్యం కనపరిచారు. ఆ సమయానికి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డికి 96,008 ఓట్లు ఉండగా వైసీపీ అభ్యర్థి వెన్నపూస 97298 ఓట్లతో కొనసాగారు. అంటే 45 మంది ఎలిమినేట్‌ అయ్యాక కూడా 1290 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

రెండో ప్రాధాన్యతలో భూమిరెడ్డి రామగోపాలరెడ్డి ఆధిక్యం

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టాక 45 మంది అభ్యరులు ఎలిమినేషన్‌ అయ్యే వరకు ద్వితీయ స్థానంలో కొనసాగిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి చివరి రెండు రౌండ్లలో ఆధిక్యం కనబరిచారు. బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర ఎలిమినేషన్‌ చేపట్టాక అప్పటి వరకు ఆయనకు ఉన్న 7871 ఓట్లు (తొలి ప్రాధాన్యతలో ఈయనకు వచ్చింది 7412 ఓట్లు.. రెండో ప్రాధాన్యతలో 459 ఓట్లు వచ్చాయి) లెక్కించారు. ఇందులో వైసీపీకి 1237 ఓట్లు రాగా టీడీపీకి 3312 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి 1009 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. చివరి రౌండ్‌లో పోతుల నాగరాజుకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ సమయానికి నాగరాజుకు ఉన్న 19760 ఓట్లు (తొలి ప్రాధాన్యతలో ఈయనకు వచ్చింది 18758 ఓట్లు, రెండో ప్రాధాన్యతలో 1002 ఓట్లు వచ్చాయి) లెక్కించారు.  ఈ రౌండ్‌లో వైసీపీకి 3352 ఓట్లు రాగా టీడీపీకి ఏకంగా 9886 ఓట్లు పడ్డాయి. దీంతో చివరి రెండు రౌండ్లు పూర్తయ్యాక టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి మెజార్టీ 7543 ఓట్లకు చేరుకుంది.

కౌంటింగ్‌ ప్రక్రియలో గందరగోళం

తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళ పరిస్థితులు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక రెండో ప్రాధాన్యతకు సంబంధించి తొలి అభ్యర్థి ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభించి ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్ల కట్టలో నుంచి తొలి ఓటు (బ్యాలెట్‌) తీయగానే అందులో మొదటి ప్రాధాన్యత ఓటు వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి ఉన్నట్లు గుర్తించారు. దీంతో తనకు పడిన తొలి ప్రాధాన్యత ఓటు ఇక్కడకు ఎలా వచ్చిందంటూ వెన్నపూస రవీంద్రారెడ్డితో పాటు వైసీపీ ఏజెంట్లు ప్రశ్నించారు. దీంతో కాసేపు అధికారులు, ఏజెంట్లకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి సర్దిచెప్పి ఆ ఓటును తొలి ప్రాధాన్యతగా రవీంద్రారెడ్డికే కలుపుతామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఆ తర్వాత ఇతర అభ్యర్థులకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేసే సమయంలోనూ, అంతకు ముందు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయంలోనూ వైసీపీ అభ్యర్థి వెన్నపూసకు వ్యతిరేకంగా.. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డికి మేలు జరిగేలా కొన్ని ఘటనలు వెలుగు చూశాయి. దీంతో వైసీపీ అభ్యర్థి వెన్నపూస కౌంటింగ్‌ జరుగుతున్న ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రిటర్నింగ్‌ అధికారి నాగలక్ష్మికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు.

భూమిరెడ్డిని విజేతగా ప్రకటించిన కలెక్టర్‌ నాగలక్ష్మి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి పలు ఫిర్యాదులు చేసినా, అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోని అధికారులు.. ఎట్టకేలకు కౌంటింగ్‌ మొత్తం పూర్తి చేశారు. శనివారం (18వ తేదీ) రాత్రి 8 గంటల సమయానికి కౌంటింగ్‌ అంతా పూర్తి చేసి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి 7543 ఓట్లతో విజయం సాధించినట్లు రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రకటించారు. టీడీపీకి 109781 ఓట్లు, వైసీపీకి 102238 ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. అయితే అధికారికంగా ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలు రాగానే డిక్లరేషన్‌ అందజేస్తామని కలెక్టర్‌ నాగలక్ష్మి స్పష్టం చేశారు.

డిక్లరేషన్‌ విషయంలో టీడీపీ డ్రామా

నిబంధనల ప్రకారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించాలంటే అభ్యర్థికి 1,13,225 ఓట్లు రావాలి. కానీ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డికి 109781 ఓట్లు మాత్రమే వచ్చాయి. వాలిడ్‌ ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువగా వస్తే మాత్రమే రిటర్నింగ్‌ అధికారి అప్పటికప్పుడు డిక్లరేషన్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. దీంతో అభ్యర్థుల ఓట్లు, ఇతర వివరాలను రిటర్నింగ్‌ అధికారి నాగలక్ష్మి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. అక్కడి నుంచి రాగానే డిక్లరేషన్‌ అందిస్తారు. ఈ విషయం స్పష్టంగా తెలిసినా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం డ్రామాలకు తెరలేపారు. రాజకీయంగా లబ్ధిని పొందడమే లక్ష్యంగా డిక్లరేషన్‌ ఇవ్వడం లేదంటూ శనివారం రాత్రి 11 గంటల సమయంలో హంగామా చేశారు. చివరకు అరెస్టై రాష్ట్ర వ్యాప్తంగా తమ మీదకు అటెన్షన్‌ తెచ్చుకున్నారు. ఏమీ తెలియని గల్లీ లీడర్లు ఇదంతా చేశారంటే పర్లేదు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పని చేసిన నాయకులు కూడా అధికార పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ కౌంటింగ్‌ కేంద్రం వద్ద, బయట రాద్ధాంతం చేశారు. మొత్తానికి డ్రామాను రక్తికట్టించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంగా టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడకు చేరుకున్నాక ఆందోళన సంగతి పక్కన పెట్టి భూమిరెడ్డి రామగోపాలరెడ్డిని నాయకులు పూలబొకేలు అందిస్తూ స్వీట్లు తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు.

శనివారం అర్ధరాత్రే డిక్లరేషన్‌కు అనుమతి

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి శనివారం రాత్రి 8 గంటలకు ఫలితాలకు (సగం కంటే ఒక ఓటు ఎక్కువగా రాలేదని తెలుపుతూ) సంబంధించి ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించడంతో ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు అక్కడి నుంచి డిక్లరేషన్‌ అనుమతి వచ్చింది. ఇదే విషయాన్ని గెలుపొందిన అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డికి అధికారులు తెలియజేశారు. ఉదయాన్నే డిక్లరేషన్‌ అందిస్తామని సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం అనంతపురం కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ చాంబర్‌లో భూమిరెడ్డికి డిక్లరేషన్‌ అందిస్తామని, కవరేజ్‌కు రావాలని మీడియాకూ సమాచారం అందించారు. కోటా ఓట్ల కంటే తక్కువగా వస్తే డిక్లరేషన్‌ పత్రం అందించే విషయంలో స్పష్టంగా నిబంధనలు ఉన్నా తెలుగుదేశం పార్టీ నేతలకు మాత్రం ఇవేమీ పట్టలేదు. ఆదివారం ఉదయం కూడా కలెక్టరేట్‌ వద్ద హంగామా చేశారు. ఈ విషయాన్ని కూడా హైలెట్‌ చేసుకోవడంలో టీడీపీ సక్సెస్‌ అయింది. ఇలా అడుగడుగునా డ్రామాను రక్తికట్టించిన టీడీపీ నేతలు.. చివరకు రిటర్నింగ్‌ అధికారి నాగలక్ష్మి చేతుల మీదుగా డిక్లరేషన్‌ ఫారం అందుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారధి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి,  ధర్మవరం ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరాం, టీడీపీ నేతలు ఉమామహేశ్వరనాయుడు, ఆలం నరసానాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీచర్స్‌ ఎమ్మెల్సీ విషయంలోనూ డిక్లరేషన్‌ ఆలస్యం

పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలోనే కాదు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డిక్లరేషన్‌ అందించే విషయంలోనూ ఆలస్యమైంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఎవరికీ 50 శాతానికి మించి ఒక ఓటు అధికంగా రాలేదు. ఎలిమినేషన్‌ చేపట్టాక వైసీపీ బలపరచిన ఎంవీ రామచంద్రారెడ్డి తొలి స్థానంలో, ఒంటేరు శ్రీనివాసరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 17వ తేదీ తెల్లవారుజామున టీచర్స్‌ ఎమ్మెల్సీ కౌంటింగ్‌ పూర్తికాగానే ఎంవీ రామచంద్రారెడ్డి గెలిచినట్లు మాత్రమే జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ ప్రకటించారు. ఆయనకు డిక్లరేషన్‌ పత్రం ఇవ్వలేదు. ఫలితాల వివరాలను ఎన్నికల కమిషన్‌కు పంపి అక్కడ నుంచి అనుమతి వచ్చాక 17వ తేదీ మధ్యాహ్నం ఎంవీ రామచంద్రారెడ్డికి రిటర్నింగ్‌ అధికారి నాగలక్ష్మి డిక్లరేషన్‌ పత్రం అందజేశారు. ఇక్కడ కూడా ఫలితాలు వెల్లడిరచాక డిక్లరేషన్‌ అనుమతి రావడానికి ఐదారు గంటలు పట్టింది.

డిక్లరేషన్‌ పత్రం ఇవ్వాలంటే జరగాల్సిన  ప్రక్రియ ఇదే

పట్టభద్రులు, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డిక్లరేషన్‌ పత్రం అందించే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రామగోపాలరెడ్డి విజయం సాధించినట్లు శనివారం రాత్రి 8 గంటలకు అధికారులు తెలియజేసినా డిక్లరేషన్‌ పత్రం ఇవ్వడంలో జరిగిన జాప్యం గురించి కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న ఓ కీలక అధికారితో ‘మనస్సాక్షి ప్రతినిధి’ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ‘‘సాధారణంగా ఏ అభ్యర్థికయినా వాలిడ్‌ అయిన ఓట్ల నుంచి కోటా ఓట్లు (సగం కంటే ఒక ఓటు ఎక్కువగా) వస్తే డిక్లరేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి ఇచ్చేయచ్చు. కానీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల విషయంలో అది జరగలేదు. అందుకోసం చివర రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థుల వివరాలు, ఓట్లను పొందుపరుస్తూ రిటర్నింగ్‌ అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు. ముందుగా రిటర్నింగ్‌ అధికారి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్తుంది. అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుంది. పంపిన సమాచారం వాస్తవమా? కాదా? అని ధ్రువీకరించుకున్న తర్వాత కోటా ఓట్ల కంటే తక్కువగా ఉన్నా సరే అత్యధిక ఓట్లు వచ్చిన కారణంగా మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థికి డిక్లరేషన్‌ అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి.. అక్కడి నుంచి రిటర్నింగ్‌ అధికారికి ఆదేశాలు వస్తాయి. ఈ ప్రక్రియ జరగడానికి కనీసం నాలుగైదు గంటలు పడుతుంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల విషయంలోనూ అదే జరిగింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఆ సమాచారం పంపితే అర్ధరాత్రి సమయానికి మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థికి డిక్లరేషన్‌ పత్రం అందించాలని ఆదేశాలు వచ్చాయి’’ అని సదరు అధికారి ‘మనస్సాక్షి ప్రతినిధి’కి తెలియజేశారు.

ఉత్కంఠ పోరులో రామచంద్రారెడ్డిదే విజయం
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి :   పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి విజయం సాధించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో చివరకు గెలుపు సొంతం చేసుకున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన్ను విజయం వరిస్తుందని భావించినా ‘లెక్క’ తప్పింది. చివరకు రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సి వచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థికి సరైన మెజార్టీ దక్కకపోవడంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టి 169 ఓట్ల తేడాతో ఎం.వి.రామచంద్రారెడ్డి గెలిచినట్లుగా జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ ప్రకటించారు. మొత్తం ఓట్లలో ఎం.వి.రామచంద్రారెడ్డికి 10,787 ఓట్లు రాగా ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 10,618 ఓట్లు  వచ్చాయి. పోలైన ఓట్లలో సంగం కంటే ఒక ఓటు ఎక్కువగా ఎవరికీ రాకపోవడంతో అధికారికంగా ఎన్నికల కమిషన్‌ అనుమతి పొందిన తర్వాత ఎం.వి.రామచంద్రారెడ్డి గెలుపుని ప్రకటించడం జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ తెలిపారు.

అనంతపురం జేఎన్‌టీయూలో గురువారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.  కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్య సాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈనెల 13వ తేదీన జరిగిన పోలింగ్‌లో 28,148 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 25,884 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఎంవీ రామచంద్రారెడ్డి ఆధిక్యత కనబరిచారు. తొలి ప్రాధాన్యత ఓట్ల ముగింపు సమయానికి ఎవరికీ సగం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు.  దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొదటి ప్రాధాన్యతకు సంబంధించి  వైసీపీ బలపరచిన రామచంద్రారెడ్డికి 8846 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఒంటేరు శ్రీనివాసులరెడ్డి 6853, తృతీయ స్థానంలో పీడీఎఫ్‌ బలపరచిన కత్తి నరసింహారెడ్డి 4162 ఓట్లు సాధించారు. నాలుగో స్థానంలో డాక్టర్‌ చామల అనిల్‌ వెంకట ప్రసాద్‌రెడ్డి అలియాస్‌ రూపాయి డాక్టర్‌ 3212 ఓట్లు సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో జీవీ నారాయణరెడ్డి (1345), డాక్టర్‌ మాధవరావు (354), దాసరి రామశేషయ్య (187), కొత్తపల్లి అనిల్‌కుమార్‌రెడ్డి (186), బండ్లపల్లి మదన్‌మోహన్‌రెడ్డి (73), చామల వరలక్ష్మి (24), శ్రీనివాసరావు (16), గంగాధర్‌రెడ్డి (13) నిలిచారు. తొలి ప్రాధాన్యతలో ఎవరికీ విజయం కోసం కావాల్సిన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. తక్కువ ఓట్లు వచ్చిన వారి ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. వారికి వేసిన రెండో ప్రాధాన్యత ఓట్లను ఆపైన ఉన్న వారికి కలుపుకుంటూ వెళ్తూ ఎలిమినేట్‌ ప్రారంభించారు. ముందుగా గంగాధర్‌రెడ్డి, శ్రీనివాసరావు, చామల వరలక్ష్మి ఎలిమినేట్‌ అయ్యారు. ఆ తర్వాత బండ్లపల్లి మదన్‌మోహన్‌రెడ్డి, కొత్తపల్లి అనిల్‌కుమార్‌రెడ్డి, దాసరి రామశేషయ్య, మాధవరావు ఎలిమినేట్‌ అయ్యారు.

జీవీ నారాయణరెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సమయం నుంచి పోరు ఆసక్తికరంగా మారింది. జీవీ నారాయణరెడ్డి ఎలిమినేట్‌ అయ్యే సమయానికి ఆయనకు 1421 ఓట్లు పోలై ఉండగా ఇందులో రెండో ప్రాధాన్యత ఓట్లుగా ఒంటేరు శ్రీనివాసరెడ్డికి ఏకంగా 461 ఓట్లు పడ్డాయి. కత్తి నరసింహారెడ్డికి 311, డాక్టర్‌ అనిల్‌కు 209 ఓట్లు, ఎంవీ రామచంద్రారెడ్డికి 135 ఓట్లు పడ్డాయి.

జీవీ నారాయణరెడ్డి ఎలిమినేట్‌ అయ్యాక డాక్టర్‌ అనిల్‌కు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. అప్పటికి డాక్టర్‌ అనిల్‌కు 3533 ఓట్లు ఉండగా అందులో రెండో ప్రాధాన్యతగా ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 909 ఓట్లు, కత్తి నరసింహారెడ్డికి 623 ఓట్లు, ఎంవీ రామచంద్రారెడ్డికి 1007 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 9 మంది ఎలిమినేట్‌ అయ్యే సమయానికి వైసీపీ మద్దతుతో బరిలో ఉన్న రామచంద్రారెడ్డి 1598 ఓట్ల మెజార్టీతో కొనసాగారు.

డాక్టర్‌ అనిల్‌ ఎలిమినేట్‌ అయ్యాక కత్తి నరసింహారెడ్డికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఆ సమయానికి కత్తి నరసింహారెడ్డికి 5279 ఓట్లు ఉన్నాయి. ఇందులో రెండో ప్రాధాన్యత ఎవరికి వచ్చాయో లెక్కించగా ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 2219 ఓట్లు, రామచంద్రారెడ్డికి 692 ఓట్లు వచ్చాయి. చివరకు అందరూ ఎలిమినేట్‌ అయ్యాక రామచంద్రారెడ్డి 169 ఓట్ల మెజార్టీతో ఉండడంతో ఆయన విజయం సాధించినట్లు శుక్రవారం తెల్లవారుజామున రిటర్నింగ్‌ అధికారి కేతన్‌ గార్గ్‌ ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌.. విజేతను ఎలా ప్రకటిస్తారంటే..!
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో :  పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. అనంతపురంలోని జేఎన్‌టీయూ వేదికగా మరి కొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి  ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. టీచర్స్‌, గ్రాడ్యుయేట్స్‌ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి 49 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలో ఈనెల 13వ తేదీన జరిగిన పోలింగ్‌లో 2,44,307 ఓట్లు పోలయ్యాయి. టీచర్స్‌ ఎమ్మెల్సీకి సంబంధించి బరిలో 12 మంది ఉండగా 25,884 ఓట్లు పోలయ్యాయి.

పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్‌కు 24 టేబుళ్లు, టీచర్స్‌ ఎమ్మెల్సీకి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుల స్థానానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం అర్ధరాత్రి సమయానికే కొలిక్కి రానుండగా..పట్టభద్రుల స్థానం ఓట్ల లెక్కింపునకు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్‌ సిబ్బందిని మానసికంగా సిద్ధం చేశారు. రోజూ మూడు షిఫ్టుల వారీగా కౌంటింట్‌ చేపట్టనున్నారు. కడప-కర్నూల్‌-అనంతపురము పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కౌంటింగ్‌లో రిజర్వుడు సిబ్బందితో కలిపి దాదాపు 600 మంది పాల్గొననున్నారు.

విజేతను ఎలా ప్రకటిస్తారంటే..?

సాధారణ ఎన్నికల కౌంటింగ్‌కు, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు తేడా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓట్ల వారీగా కౌంటింగ్‌ జరుగుతుంది. ఎక్కువ మంది ఓటు వేసిన..అంటే, కనీసం 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా అన్ని బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను కలిపేస్తారు. దీని వల్ల ఏ పోలింగ్‌ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిసే అవకాశం ఉండదు. పోటీలో ఉన్న అభ్యర్థి విజయం సాధించాలంటే చెల్లిన ఓట్లలో సగం కంటే ఒక ఓటు రావాల్సి ఉంటుంది.

ముందుగా (1) మొదటి ప్రాధాన్యత ఓట్లను ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. వీటిలోనే చెల్లిన ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువగా వస్తే ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పుడు 2, 3, 4.. ఇలా 49 వరకు పెట్టిన ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన అవసరం రాదు.

మొదటి ప్రాధాన్యత (1) ఓట్లు ఎవరికీ సగం కంటే ఒకటి ఎక్కువ రాకపోతే అందరి కంటే తక్కువ మొదటి ఓట్లు వచ్చిన అభ్యర్థిని (ఎలిమినేట్‌) చేస్తారు. ఆ అభ్యర్థి రెండవ ప్రాధాన్యత (2) ఓట్లను మిగిలినవారికి ఎవరికెన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు.

ఇప్పుడు ఏ అభ్యర్ధికైనా సగం కంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చినట్లయితే ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. ఒక వేళ
అప్పటికీ సగం కంటే ఒక ఓటు ఎక్కువగా రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్‌ చేస్తారు. అతడి రెండో ప్రాధాన్యత (2) ఓట్లు మిగిలిన వారిలో ఎవరికెన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు.

అప్పటికీ ఎవరికీ సగం కంటే ఒక ఓటు అధికంగా రాకపోతే ఎలిమినేట్‌ అయిన ఇద్దరు అభ్యర్థుల మూడవ ప్రాధాన్యత (3) ఓట్లు కూడా లెక్కించి పైవారికి కలుపుతారు. ఇలా సగం కంటే ఒక ఓటు అధికంగా వచ్చే వరకు కింది నుండి తక్కువ ఓట్లు వచ్చిన వారి 2, 3, 4 ఓట్లు ఇలా ఒక క్రమంలో కలుపుకుంటూ పోతారు.

ఒక వేళ చివరి వరకు సగం కంటే ఒక ఓటు అధికంగా రాకపోతే ఎలిమినేట్‌ కాకుండా ఉన్న చివరి అభ్యర్ధి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు.

కౌంటింగ్‌ ఏర్పాట్లపై ఎస్పీ ఫక్కీరప్ప సమీక్ష

అనంతపురంలోని జేఎన్‌టీయూలో స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ హాళ్లను ఎస్పీ ఫక్కీరప్ప బుధవారం పరిశీలించారు. కౌంటింగు ఏర్పాట్లు, లైటింగ్‌, సి.సి కెమేరాల పనితీరు, అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారుల వాహనాల ఎంట్రీ, పార్కింగ్‌, తదితరాలపై సమీక్ష చేశారు. బందోబస్తు, భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలు నిషేధమని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేవారు. ఎస్పీ వెంట డీఎస్పీ ప్రసాదరెడ్డి, వన్‌టౌన్‌ సీఐ రవిశంకర్‌రెడ్డి, తహశీల్దార్‌ మూర్తి తదితరులు ఉన్నారు.

పశ్చిమాన ఓటెత్తారు..! గెలుపు లెక్కల్లో అభ్యర్థులు..!!
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముసిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 4 గంటల సమయానికి పోలింగ్‌ కేంద్రాల ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు. మొత్తంగా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 74 శాతం  పోలింగ్‌ జరిగింది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఏకంగా 91.96 శాతం పోలింగ్‌ నమోదైంది. అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఉదయం 8 గంటల నుంచే ఓటు వేసేందుకు గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆసక్తి చూపారు. అనుకున్న దానికంటే అధికంగా పోలింగ్‌ నమోదైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోటీలో 49 మంది, టీచర్స్‌ ఎమ్మెల్సీ పోటీలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. బ్యాలెట్‌ బాక్సుల్లో ఓటర్లు ఎవరి జాతకం ఎలా రాశారో తెలియాలంటే ఈనెల 16వ తేదీ వరకు ఆగాల్సిందే..!

పట్టభద్రుల స్థానంలో 74 శాతం పోలింగ్‌

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా తొలి రెండు గంటల్లో 11.36 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 27.95 శాతం.. మధ్యాహ్నం 2 గంటల వరకు 47.55 శాతం పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు 65.92 శాతం పోలింగ్‌ కొనసాగింది. ఆ తర్వాత క్యూలో ఉన్న వారికి అనుమతించారు. చివరకు 74 శాతం పోలింగ్‌ నమోదైంది.

జిల్లాల వారీగా పట్టభద్రుల పోలింగ్‌ వివరాలు

<colgroup><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /></colgroup>

జిల్లా

మొత్తం ఓటర్లు

పోలైన ఓట్లు

పోలింగ్‌ శాతం

కడప

81317

58560

72.01

అన్నమయ్య

20594

15162

73.63

అనంతపురం

68341

52137

76.29

శ్రీసత్యసాయి

43310

32201

74.35

కర్నూలు

61633

43944

71.30

నంద్యాల

54929

42303

77.03

మొత్తం

330124

244307

74

ఉపాధ్యాయుల స్థానంలో 91.96 శాతం పోలింగ్‌

పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించి ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా తొలి రెండు గంటలో 18.35 శాతం నమోదైంది. మధ్యాహ్నం 12 గంటలకు 48.56 శాతం నమోదు కాగా 2 గంటల సమయానికి 70.31 శాతం ఓటింగ్‌ జరిగింది. సాయంత్రం 4 గంటలకు 89.38 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉండడంతో మొత్తంగా 91.96 శాతం పోలింగ్‌ నమోదైంది.

జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోలింగ్‌ వివరాలు

<colgroup><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /><col style="width:25.0391%;" /></colgroup>

జిల్లా

మొత్తం ఓటర్లు

పోలైన ఓట్లు

పోలింగ్‌ శాతం

కడప

7461

6813

91.31

అన్నమయ్య

1958

1828

93.36

అనంతపురం

5564

5110

91.84

శ్రీసత్యసాయి

3348

3104

92.71

కర్నూలు

5391

4868

90.30

నంద్యాల

4426

4161

94.01

మొత్తం

28148

25884

91.96

వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియ పరిశీలన

అనంతపురం కలెక్టరేట్‌ నుంచి రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎన్నికల పరిశీలకులు పోలా భాస్కర్‌, హరి జవహర్‌ లాల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌, ఎస్పీ ఫక్కీరప్పలు వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ సరళి, పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉంటున్న పరిస్థితులకు అంచనా వేశారు. అదేవిధంగా అనంతపురంలోని  నెహ్రూ మునిసిపల్‌ అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలో పోలింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ నాగలక్ష్మి పరిశీలించారు. అనంతపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఆర్డీఓ మధుసూదన్‌ పరిశీలించారు.

చిత్తూరులో అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ పర్యవేక్షణ

పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చిత్తూరు పట్టణంలోని కన్నన్‌ కాలేజీ, జి.డి.నెల్లూరు మండలంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జరుగుతున్న పోలింగ్‌ సరళిని  అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ పరిశీలించారు. భద్రత చర్యలను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సూచనలు చేస్తూ ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం విధులు కొనసాగాలని తెలియజేశారు. డీఐజీ వెంట చిత్తూరు ఎస్పీ రిశాంత్‌రెడ్డి, ఎస్‌డీపీఓ శ్రీనివాసమూర్తి తదితరులు ఉన్నారు.

1200 మంది పోలీసులతో బందోబస్తు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1200 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టడంతో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ముందుగానే హైపర్‌ సెన్సిటివ్‌, సెన్సిటివ్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. క్షేత్ర స్థాయిలో   హోంగార్డు, కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు, ఆపైస్థాయి అధికారులు, మహిళా పోలీసులు బాగా పని చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌ ప్రక్రియను ఎస్పీ ఫక్కీరప్ప స్వయంగా పర్యవేక్షించారు. అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రాప్తాడు జిల్లా పరిషత్‌ పాఠశాల, కళ్యాణదుర్గంలోని నార్త్‌ ప్రభుత్వ పాఠశాల, గుంతకల్లులోని ఇందిర స్త్రీ శక్తి భవన్‌ , ఎంఆర్‌పీ, ఎంపిడిఓ కార్యాలయాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఓటు వేసేందుకు క్యూలైన్లలో వెళ్తున్న ఓటర్ల వద్ద ఉన్న గుర్తింపు కార్డులను చెక్‌ చేశారు.  పోలింగ్‌ కేంద్రాల పరిసరాలలో నియమించిన పోలీసు బందోబస్తును సమీక్షించారు.