Sports - Manassakshi Telugu Daily

తొలి టీ-20లో నమీబియా సంచలనం
మనస్సాక్షి డెస్క్‌ : ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం ప్రారంభమైన టీ-20 ప్రపంచ కప్‌ తొలి మ్యాచ్‌లో నమీబియా జట్టు సంచలనం నమోదు చేసింది. శ్రీలంకను చిత్తు చేసింది. 55 పరుగుల తేడాతో నమీబియా విజయం సాధించింది. టాస్‌ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. నమీబియా జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్‌ ఫ్రైలింక్‌ 44 పరుగులు, స్మిత్‌ 31 పరుగులు చేశారు. ఈటన్‌, బార్డ్‌, కెప్టెన్‌ ఇరాస్మస్‌ రాణించారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 పరుగులకే కుశాల్‌ మెండిస్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. షికోంగో వేసిన నాలుగో ఓవర్‌లో నిస్సాంక, గుణతిలక వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. ఆ తర్వాత ఏ దశలోనే కోలుకోలేదు. 88 పరుగులకు 7 వికెట్లు చేజార్చుకుంది. రాజపక్స, షణక, ధనంజయ డిసిల్వ, తీక్షణ మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. 19 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఘోరంగా ఓడిరది. నమీబియా బౌలర్లలో ఫ్రైలింక్‌, షికోంగో, వైస్‌, బెర్నార్డ్‌ రెండు వికెట్లు చొప్పున తీసుకున్నారు.

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
మనస్సాక్షి, కణేకల్లు: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు పురుషోత్తం, కోచ్ లు అనిల్ కుమార్, రాఘవేంద్ర, రాజేష్, నారాయణస్వామి, మణికంఠ ల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి 3కే రన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక సాయిబాబా దేవాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైసీపీ పట్టణ కన్వీనర్ కేశవరెడ్డి, వేలూరు మరియప్ప, హోండా షోరూం దాదాపీర్, మారంపల్లి నాగరాజు, హనుమంత రెడ్డి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ పోటీలలో కణేకల్లు, బొమ్మనహల్, డి. హీరేహల్, రాయదుర్గం, గుమ్మగట్ట మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.