Politics - Manassakshi Telugu Daily

చంద్రబాబువి పగటికలలు
మనస్సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటికలలు కంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటామిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, కేవలం కేడర్‌ను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు తంటాలు పడుతున్నారని తెలిపారు. నగరంలోని 40వ డివిజన్‌లో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించారు. స్థానికంగా సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. సుమారు ఏడాది కాలంగా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల గడప వద్దకు వెళ్తున్నామని, జగన్‌ నాయకత్వం పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు తోడు సచివాలయ వ్యవస్థ పనితీరు బాగుందని ప్రజలు చెబుతున్నారన్నారు. జనం సంతోషంగా ఉంటే చంద్రబాబు మాత్రం బాధపడుతున్నారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. అందుకే ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం రాదన్న ఫ్రస్టేషన్‌లో సీఎం జగన్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా రూ.2 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. చంద్రబాబుకు ప్రజా సంక్షేమం పట్ల విజన్‌ లేదని,  కేవలం అధికారంలోకి రావడం మాత్రమే ఆయన విజన్‌ అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమని తెలిసి పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌ సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారని అంటూనే తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకమేనని అన్నారు.

గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ఇస్తామంటే అవహేళన చేశారని గుర్తు చేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా అన్ని వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తిగా వైఎస్‌ జగన్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ పెరిగిందని, మరోసారి జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్‌ మహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఫయాజ్, జేసీఎస్‌ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, కార్పొరేషన్ల డైరెక్టర్లు గౌస్‌బేగ్, శ్రీనివాసులు, వైసీపీ బీసీ విభాగం రీజనల్‌ కో ఆర్డినేటర్‌ రమేష్‌గౌడ్, వైసీపీ నాయకులు ఖాదర్, షరీఫ్, సందీప్, ఇసాక్, నల్లప్ప, గుజ్జల లక్ష్మణ్, గౌతమి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

మా నమ్మకం నువ్వే జగన్‌.. ఇది ప్రజల నినాదం
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనేది ప్రజల నినాదమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అందుకే ‘జగనన్నే మా భవిష్యత్‌’ అని జనం అంటున్నారని చెప్పారు. శుక్రవారం నగరంలోని నవోదయ కాలనీలో ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రజాప్రతినిధులతో పాటు వైసీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో కలిసి పలు కుటుంబాలను నేరుగా కలిశారు.

చంద్రబాబు పాలనకు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు తేడాను వివరించి ప్రజల మద్దతు కోరారు. భవిష్యత్‌లోనూ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఉంటారా? సంక్షేమ పథకాలు అందుతున్న తీరు బాగుందా? ఇంకా ఏమైనా మార్పు చేయాలా? అని ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. అంతకుముందు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనంత మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన పార్టీ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు కలవడమే లక్ష్యంగా ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈనెల 20వ తేదీ వరకు దాదాపు 14 రోజులు ప్రజలతో మమేకమవుతామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల 10 నెలలుగా సీఎం జగన్‌ నాయకత్వంలో క్లిష్టపరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. ఎన్నికల సమయంలో జగన్‌ చేసిన వాగ్ధానాలను 98 శాతం అమలు చేసినట్లు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. ఎక్కడా అవినీతి, పక్షపాతం లేకుండా పథకాలు అందిస్తున్నామని, అందరికీ సంక్షేమం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. పరిపాలనలో నూతన సంస్కరణలు తెచ్చి ప్రజల వద్దకు పాలన చేరువ చేశామన్నారు.  సచివాలయ వ్యవస్థ తెచ్చి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మూడేళ్ల 10 నెలల్లో రూ.2 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందజేసిన ఘనత తమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు.  ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్నారు.

2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేదని చెప్పారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. పేదల పక్షాన తమ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ తరం బాగుపడాలన్నా.. భవిష్యత్‌ తరాలకు ఉజ్వల భవిష్యత్‌ ఉండాలన్నా వైసీపీ అధికారంలో ఉండాలని, జగన్‌ సీఎంగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి క్లస్టర్‌ పరిధిలో రోజూ 10 నుంచి 15 కుటుంబాలను కలిసి ప్రజామద్దతు కోరనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజల సమ్మతితో ప్రతి ఇంటికీ స్టిక్లర్లు అందిస్తామన్నారు. వైసీపి జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య మాట్లాడుతూ పేదలకు ఏదైనా మంచి జరిగిందంటే అది జగన్‌ సీఎం అయిన తర్వాతేనని చెప్పారు. భవిష్యత్‌లో ఇంకా మంచి జరగాలంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు.

నిజం మాట్లాడితే తల వెయ్యిముక్కలు..!
మనస్సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి సెటైర్‌ వేశారు. యువగళం పాదయాత్రలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తూ లోకేష్‌ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఆయన తండ్రి చంద్రబాబు చేసిన హితోపదేశం ఒకటుందంటూ ఎద్దేవా చేశారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. ‘‘నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించే సమయంలో ఆయన తండ్రి చంద్రబాబు ఒక మాట చెప్పినాడంట.!  ఇన్నేళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజూ నేను నిజం చెప్పలేదు. నిజం చెబితే నా తల వెయ్యి ముక్కలవుతుందని శాపం ఉంది. నీక్కూడా అదే శాపం ఉంది. పొరపాటున కూడా నిజం మాట్లాడొద్దు అని చెప్పినాడంట. అందుకే లోకేష్‌ మిడిమిడి జ్ఞానంతో మా ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నాడు’’ అని చెప్పారు. గళం ఉన్నోడు యువగళం అని పెట్టుకోవాలని, కానీ గళమే లేనోడు.. మంగళగిరికి, మందలగిరికి తేడా తెలీనోడు పాదయాత్ర చేస్తే ఎట్లుంటుందో నిన్న అనంతపురంలో చూశామని చింతా తెలిపారు. ‘‘ నారా లోకేష్‌ను మా మంత్రి రోజా గారు మాలోకం అని ఒక పేరుతో పిలుస్తారు. మా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు 23వ పులకేశి అని అంటారు.  తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వంశీ అయితే పప్పు అంటారు. పప్పు అని అంటే వాళ్ల నాయన, ఈయన, వాళ్ల మామ అందరూ కూలి పెట్టుకుని ఏడ్చే పరిస్థితి. కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, వయసు తారతమ్యం లేకుండా ఏంది నోటికి వస్తే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు. నారా లోకేష్‌ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివానని అంటాడు. నీ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ స్టాండర్డ్‌ ఇదేనా? అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఎస్కేయూలో ప్రొఫెసర్‌గా పని చేశారని అన్నావు’’ అని ఎద్దేవా చేశారు.

కోవిడ్‌ సమయంలో ఈ నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరితో సహా టీడీపీ నాయకులు ఇన్నాళ్లూ ఏదైతే చెబుతున్నారో అదే లోకేష్‌ మాట్లాడారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రోడ్డు తీసుకొచ్చింది మేమే అని వాళ్లు రాసిస్తే చదివినాడు.. హాస్పిటల్‌ తెచ్చింది మేమే అని రాసిస్తే అది చదివినాడు అని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ లబ్ధి కలగలేదని అనడం లోకేష్‌ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని చెప్పారు. అనంతమైన అవినీతి ఇప్పుడు ఎక్కడా జరగలేదని..టీడీపీ హయాంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ స్వరూప ఉన్నప్పుడే అనంతమైన అవినీతి చేసి అభివృద్ధిని విస్మరించినట్లు విమర్శించారు. ఇదే అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌ చౌదరి కొట్టుకునే స్థాయికి వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు టవర్‌ క్లాక్‌ వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఎలా ఉంది? గతంలో తాము కట్టామని చెబుతున్న రాంనగర్‌ బ్రిడ్జి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. రాంనగర్‌ బ్రిడ్జి ప్రారంభం సమయంలోనూ చెరో టెంకాయ కొట్టుకున్నారని.. జేసీ దివాకర్‌రెడ్డి బ్రిడ్జిని ఎలా ప్రారంభించారన్న చరిత్ర కళ్ల ముందే ఉందన్నారు. టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్లే 50 డివిజన్లకు గాను ఒక్కటి కూడా గెలవలేదన్నారు. అప్పట్లో టీడీపీ నాయకుల తీరు, దౌర్జన్యాలు ఎలా ఉండేవో అందరికీ తెలుసని అన్నారు. పిచ్చోడిని తీసుకొచ్చి నాలుగు పిచ్చిమాటలు మాట్లాడిస్తే ఇక్కడి ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. నగరంలో తాగునీటి సౌకర్యం కల్పించిన ఘనత అనంత వెంకటరామిరెడ్డిదని, దశాబ్ధకాలంగా నీటికి నోచుకోని చెరువుకు హంద్రీనీవా నీరు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు. నడిమివంక పనుల కోసం వెచ్చించాల్సిన నిధులను చెరువు కట్ట వద్దకు తరలించిన పాపం ఎవరిదని ప్రశ్నించారు. పాదయాత్రలో లోకేష్‌ పిచ్చి ప్రేలాపనలు మానాలని, అనంత వెంకటరామిరెడ్డి గురించి చంద్రబాబును అడిగితే తెలుస్తుందని సూచించారు. ‘‘ఉమ్మడి అనంతపురం జిల్లా ముద్దుల మామయ్య (బాలకృష్ణ)ను ఆదరించిందని చెబుతున్నావు సరే.. ముద్దుల తాతయ్య వెన్నుపోటు కథ ఏందో మీ నాయన చొక్కా పట్టుకుని అడుగు’’ అని ఘాటూగా విమర్శించారు. కోవిడ్‌ సమయంలో మీ పార్టీ నాయకులు భయపడి ఇళ్లలో ఉంటే ధైర్యంగా రోగుల వద్దకు వెళ్లిన నాయకుడు అనంత వెంకటరామిరెడ్డి అని స్పష్టం చేశారు. తాము అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్లోనే ఉంటామని తెలియజేశారు. ఇంకోసారి పిచ్చికూతలు కూస్తే సమాధానం వేరేగా ఉంటుందని హెచ్చరించారు.

నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : నారా లోకేష్‌కు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్‌
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : నారా లోకేష్‌ ఓ దద్దమ్మ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫైర్‌ అయ్యారు. పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు చేపట్టిన అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే అనంత తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడిమిడి జ్ఞానంతో వాళ్లు మాట్లాడిన మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. లోకేష్‌ అజ్ఞాని అని ఇన్నాళ్లూ అందరూ అంటుంటే ఏదో అనుకున్నానని, నిన్న బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యలు చూశాక లోకేష్‌ అజ్ఞానం తెలిసిందన్నారు. ఇతరుల మౌత్‌పీస్‌గా లోకేష్‌ ఉంటాడని నిరూపితమైందన్నారు. ప్రభుత్వంపైన, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మీద, తనపైన అవాకులు చవాకులు పేలారని.. లోకేష్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. పక్కనోళ్లు చెప్పినంత మాత్రాన ఏది వాస్తవమో తెలుసుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర పేరుతో ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై బురదజల్లి వాళ్లే కడుక్కుంటారన్న ధోరణిలో లోకేష్‌ సాగుతున్నాడని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనంతపురం అభివృద్ధి చెందిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు అనంతపురంలో ఏం జరిగిందో ఇక్కడి ప్రజలందరికీ తెలుసన్నారు. నిత్యం శాంతిభద్రతలకు విఘాతం కల్పించారని, ఇప్పుడు అనంతపురం ప్రశాంతంగా ఉందని చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడ, ఎవరి కొంప కొడతారోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉండేదన్నారు. అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌ను మీరు తెచ్చిందే నిజమైతే 2015లో నేషనల్‌ హైవే పరిధిలో ఉన్న రోడ్డును ఎందుకు ఆర్‌అండ్‌బి పరిధిలోకి తెచ్చారని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో, తనకున్న పరిచయాలతో ఆర్‌అండ్‌బి నుంచి నేషనల్‌ హైవేస్‌లోకి మార్చినట్లు స్పష్టం చేశారు. అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారని తెలిపారు.

మీ బతుకంతా వినతిపత్రాలకే పరిమితం

అనంతపురంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే సహించలేక మేం వినతిపత్రాలు ఇచ్చిన పనులే అవన్నీ అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాళ్ల బతుకంతా వినతిపత్రాలు ఇవ్వడానికే సరిపోయిందని అన్నారు. అభివృద్ధి పనులు జరిగితే వ్యతిరేకించడం.. ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తాను, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

మెంటల్‌ ఉందేమో వస్తే సూపర్‌స్పెషాలిటీలోనే చూపిస్తా

రాష్ట్ర విభజనలో ఒక అంశాన్ని పట్టుకుని అనంతపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ఈరోజుకీ దాన్ని ప్రారంభించకుండా కేవలం సాధారణ ప్రభుత్వ ఆస్పత్రిలాగా, కోవిడ్‌ సెంటర్‌లాగా మార్చారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వ్యాఖ్యానించడంపైనా ఎమ్మెల్యే అనంత ఘాటుగా స్పందించారు. 2013లో తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై ఫేజ్‌ 3) కింద అనంతపురం మెడికల్‌ కళాశాల అప్‌గ్రేడ్‌లో భాగంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వచ్చిందని స్పష్టం చేశారు. కేవలం అనంతపురం మాత్రమే కాదని దేశవ్యాప్తంగా 39 మెడికల్‌ కళాశాలల అప్‌గ్రేడ్‌కు అప్పట్లో కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లలో కనీసం ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. వాళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు జరుగుతున్న అభివృద్ధికి తామే కారణమని చెప్పుకుంటున్నారని తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర వాటాగా రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి అయినా చెల్లించారా? అని ప్రశ్నించారు. ఆస్పత్రిని కోవిడ్‌కు మార్చిన మాట వాస్తవమేనని, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కోవిడ్‌ బాధితులకు వైద్యం అందించడం కోసం మార్చిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కోవిడ్‌ సమయంలోనూ తాము ప్రజల్లోనే ఉన్నామని, వాళ్లలా ప్రాణభయంతో ఇంట్లో కూర్చోలేదని స్పష్టం చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇప్పుడు ఐదు విభాగాల్లో స్పెషలిస్ట్‌ వైద్యం అందిస్తున్నామని, వాళ్లకు మెంటల్‌ ఏమైనా ఉంటే సూపర్‌ స్పెషాలిటీలోని న్యూరాలజీ విభాగంలో మంచి డాక్టర్‌తో చికిత్స అందిస్తామని చురకలంటించారు. టీడీపీ హయాంలో అనంతపురంలో ప్రారంభించి..పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ ఒక్కటుందా? అని ఎమ్మెల్యే అనంత ప్రశ్నించారు. వాళ్లలా మూడు కుంపట్లు పెట్టుకుని.. కేవలం డివైడర్లకే తాము పరిమితం కాలేదని స్పష్టం చేశారు. అనంతపురంలో అభివృద్ధి ఎలా జరుగుతోందో ప్రజలకు తెలుసని చెప్పారు.

ఒక నంబర్‌ తక్కువ నొక్కితే.. ఎన్నికల్లో నాకే జనం ఎందుకు నొక్కారు?

అనంత వెంకటరామిరెడ్డి అంటే ఏమిటో నారా లోకేష్‌ తన తండ్రి చంద్రబాబును అడిగితే చెబుతారని ఎమ్మెల్యే అనంత సూచించారు. నాలుగు సార్లు ఎంపీగా, ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర తనదని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సింగిల్‌ ఎలక్షన్స్‌ (ఎంపీ ఎన్నికలు) జరిగితే  పరిటాల రవీంద్ర హవాలోనూ.. టీడీపీ అధికారంలో ఉన్నా తాను గెలుపొందానని తెలిపారు. నిజంగా తాను ఒక నంబర్‌ తక్కువ నొక్కుతుంటే.. ప్రజలు తనకు, తాను ప్రాతినిథ్యం వహించే పార్టీకే అన్ని ఎన్నికల్లోనూ ఎందుకు నొక్కారో తెలుసుకోవాలని చురకలంటించారు. ఒకసారి గెలిచి మరోసారి గెలవనోళ్లు కూడా మాట్లాడుతున్నారని, మంత్రిగా పనిచేసినా దద్దమ్మ అని తెలిసే లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారని విమర్శించారు.

వైఎస్‌ఆర్‌ చలవతోనే అనంతకు కృష్ణా జలాలు

తాను ఎంపీగా ఉన్న సమయంలోనే రాయదుర్గం, తుమకూరు రైల్వే లైన్‌ వచ్చిందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.  ఆ తర్వాత టీడీపీ పాలనలో ఎంత పురోగతి సాధించారో వాళ్లే చెప్పాలన్నారు. హంద్రీనీవాకు  మూడు సార్లు శంకుస్థాపన చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. 40 టీఎంసీలను 5 టీఎంసీలకు చేశారని, లోకేష్‌ పక్కనున్న దద్దమ్మలు ఏనాడూ అడిగిన పాపానపోలేదన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2005లో 40 టీఎంసీలకు చేశామని, ఆ తర్వాత 2012లో అప్పటి మంత్రి రఘువీరారెడ్డితో కలిసి పాదయాత్ర ద్వారా నీళ్లతో పాటు నడిచి జీడిపల్లికి చేర్చిన చరిత్ర తమదని తెలిపారు. రాజకీయాల్లో కమిట్‌మెంట్‌ ఉంది కాబట్టే ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. మీరు దద్దమ్మలు.. ప్రజలకు మంచి చేయలేదు..యోగ్యత లేదు కాబట్టే ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపైన నమ్మకం ఉండబట్టే కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి ఒక్కసీటు రాలేదని.. అయినా సిగ్గూఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

లోకేష్‌.. నీ బంధువులతోనే ఆరా తీయ్‌..!

అనంతపురం నగరంలో కమీషన్లు తీసుకుంటున్నట్లు.. వ్యాపారులను బెదిరిస్తున్నట్లు లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనంత స్పందించారు. ‘‘లోకేష్‌ బంధువులే ఇక్కడ బార్లు కూడా నడుపుకుంటున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్లను అడిగితే వాస్తవాలు తెలుస్తాయి’’ అని తెలిపారు.

మీ మాదిరి ఇంట్లో ఉండేవాణ్ణి కాదు..!

నారా లోకేష్‌ వ్యాఖ్యలన్నీ అక్కసుతో చేసినవేనని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ‘‘నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. నీ మాదిరి, నీ పార్టీ వాళ్ల మాదిరి నేను ఇంట్లో ఉండేవాణ్ణి కాదు. నిత్యం ప్రజల్లోనే ఉంటా. మేం అభివృద్ధి చేశాం కాబట్టే ప్రజలు మావైపు నిలుస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడిన ఘటనలు ఏవైనా ఉన్నాయా అంటే ఇది టీడీపీ హయాంలోనే. అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేల తీరు వల్లే ఇబ్బంది పడ్డారు. నా నియోజకవర్గంలో ఒక్క కార్పొరేటర్‌ మీరు గెలవలేదు. ఎంపీటీసీలు గెలవలేదు. అది మీ చేతగానితం. దానికి కారణం మేం కాదు’’ అని చెప్పారు.

అంత ఉబలాటం ఉంటే రాజీనామా చేయించు

తాను సుమారు 11 నెలలుగా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నానని, సీఎం జగన్‌ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఎమ్మెల్యే అనంత తెలిపారు. రాష్ట్రంలో ‘ఉన్న వాడు.. లేని వాడు’ అని ఉంటే నేను లేని వాడి పక్షానే నిలుస్తానని సీఎం జగన్‌ బహిరంగంగా ప్రకటించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్‌కు అంత ఉబలాటంగా ఉంటే హిందూపురంలో ఆయన ముద్దుల మామయ్యతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. అప్పుడు ప్రజల అభిప్రాయం తెలుస్తుందన్నారు.

పరిటాల శ్రీరాంకు లైన్‌ క్లియర్‌..!
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో క్యాడర్‌ కూడా పని చేస్తోంది. అటు అధినేత చంద్రబాబు.. ఇటు యువనేత నారా లోకేష్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచాలని లోకేష్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలోలా ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించకుండా.. ముందు నుంచే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తు రాజకీయాలు ఉంటాయన్న ఊహాగానాలు ఓ వైపు ఉండగానే నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో పలుచోట్ల అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర ముగియగా ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే అక్కడ అభ్యర్థులను నారా లోకేష్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌, పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. సత్యవేడులో హెలెన్‌, నగరిలో భాను ప్రకాష్‌, చంద్రగిరిలో పులివర్తి నాని, పీలేరులో నల్లారి కిశోష్‌కుమార్‌రెడ్డిలను గెలిపించాలని నారా లోకేష్‌ సూచనప్రాయంగా క్యాడర్‌కు సూచించారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతుండగా..రాప్తాడు నియోజకవర్గంలోకి లోకేష్‌ మరోసారి సోమవారం అడుగుపెట్టనున్నారు.

కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరిన నారా లోకేష్‌.. ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం భిన్నంగా ప్రసంగం కొనసాగించారు. ఆదివారం బత్తలపల్లిలో జరిగిన సభలో లోకేష్‌ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరాం పేరును దాదాపు ఖరారు చేసినట్లు స్పష్టమవుతోంది. తన ప్రసంగంలో పరిటాల శ్రీరాంను ప్రజలు, క్యాడర్‌కు చూపిస్తూ నారా లోకేష్‌ ఏమన్నారంటే.. ‘‘ఒక యువకుడున్నాడిక్కడ.. ఉత్సాహవంతుడున్నాడు.. కష్టపడే మనస్తత్వం ఉంది. నా పాదయాత్ర అయినాక మీ దగ్గరకు వస్తాడు. ఆశీర్వదించండి..దీవించండి..కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలకు విజ్ఞప్తి. ఎవరూ భయపడొద్దు. 20 కేసులు నా మీద పెట్టారు. అటెంప్ట్‌ మర్డర్‌ ఉంది. ఎస్సీ, ఎస్టీ కేసుంది. కానీ తగ్గేదే లేదు’’ అని తెలియజేశారు. లోకేష్‌ ఇలా వ్యాఖ్యానించడంతో ధర్మవరం టీడీపీలో కొత్త జోష్‌ వచ్చింది.

బత్తలపల్లిలో జరిగిన సభలో లోకేష్‌ ప్రసంగం VIDEO

ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున పరిటాల శ్రీరాం పోటీలో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు తొలగిపోయాయి. కష్టకాలంలో పార్టీకి, క్యాడర్‌కు అండగా ఉన్న శ్రీరాం వైపే టీడీపీ అధినేత చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి.. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో డీలా పడిన తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు పరిటాల శ్రీరాం అండగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే వరదాపురం సూరి బీజేపీని వీడి టీడీపీలోకి చేరుతారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో పరిటాల శ్రీరాంకు ధర్మవరం నుంచి లైన్‌ క్లియర్‌ అయిందని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

ధర్మవరం... జనసంద్రం
మనస్సాక్షి, ధర్మవరం :  యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం ధర్మవరం నియోజకవర్గంలో దుమ్మురేపింది. రాప్తాడు నియోజకవర్గం పైదిండి నుంచి ప్రారంభమైన 57వరోజు పాదయాత్ర... మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ధర్మవరం ఇన్‌ చార్జి పరిటాల శ్రీరామ్‌ నేతృత్వంలో పెద్దఎత్తున పార్టీనాయకులు, అభిమానులు, ప్రజలు లోకేష్‌కు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. యాత్ర ధర్మవరంలోకి చేరుకోగానే... పట్టణమంతా జనసంద్రంగా మారింది. యువకులు కేరింతలు కొడుతూ పెద్దఎత్తున బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు నీరాజనాలు పట్టారు. యువనేత రాకకోసం ధర్మవరం రోడ్లవెంట జనం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఎదురుచూశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర్మవరంలో జనం స్వచ్చందంగా తరలిరావడంతో పార్టీశ్రేణులు ఆనందంతో పొంగిపోయాయి. తనని చూడటానికి రోడ్ల పైకి వచ్చిన ప్రజల్ని ఓపిగ్గా కలుస్తూ... వారితో ఫోటోలు దిగుతూ సమస్యలు తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ ‘‘ వైసిపి పాలనలో అన్ని వర్గాలు బాధితులే. జగన్‌ ఒక కట్టింగ్‌ అండ్‌ ఫిట్టింగ్‌ మాస్టర్‌. ఎవరూ ఆనందంగా ఉండకూడదు అనేది ఆయన కాన్సెప్ట్‌. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యవసర సరుకుల ధరలు తగ్గిస్తాం. పన్నుల భారాన్ని తగ్గిస్తాం’’ అని తెలిపారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. ధర్మవరం శివార్లలో జగన్‌ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పాడుబెట్టిన టిడ్కో గృహాలను పరిశీలించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. నామాల క్రాస్‌ వద్ద సత్యసాయి వాటర్‌ వర్క్స్‌ కార్మికులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదలచేయకపోవడంతో రెండేళ్లుగా జీతాలు లేవని ఆవేదన చెందారు. యువనేత లోకేష్‌ స్పందిస్తూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యసాయి మంచినీటి పథకాన్ని దత్తత తీసుకుని మరింత విస్తరిస్తానని, కార్మికుల సేవలు వినియోగిచుకుంటామని చెప్పి ముందుకు సాగారు. ధర్మవరంలో నిర్వహించిన యువనేత పాదయాత్రలో వివిధ వర్గాలనుంచి వినతులు వెల్లువెత్తాయి. చేనేత కార్మికులు, బలిజలు, రజకులు, ముస్లింలు, స్వర్ణకారులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. చంద్రన్న నేతృత్వంలో రాబోయే టిడిపి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటుందని చెబుతూ ముందుకు సాగారు.

యువగళం పాదయాత్రలో భాగంగా ఆదివారం ధర్మవరం 28వవార్డులో టిడ్కో గృహాలను లోకేష్‌ పరిశీలించారు. తాను ఇటుగా వస్తున్నానని, ఆగమేఘాల మీద టిడ్కో ఇళ్లకి రంగులు వేయిస్తున్న వైసీపీ సర్కారు నాలుగేళ్లుగా వీటిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక ఏడాదికి 5లక్షల ఇళ్లు కట్టిస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికిన జగన్మోహన్‌ రెడ్డి నాలుగేళ్లలో కట్టింది నాలుగు ఇళ్లు మాత్రమే. కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్‌ మేం కట్టిన ఇళ్లకు మాత్రం సిగ్గులేకుండా రంగులు వేసుకుంటున్నారు.పేదవాడు కూడా సౌకర్యవంతమైన ఇళ్లలో నివసించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో 5లక్షల టిడ్కో గృహాలను గ్రౌండిరగ్‌ చేశాం.ఈ ప్రభుత్వం వచ్చాక కుంటిసాకులతో దాదాపు సగం ఇళ్లను రద్దుచేసింది.గత ప్రభుత్వంలోనే దాదాపు 90శాతం పూర్తయిన 2.62లక్షల టిడ్కో ఇళ్లను మిగిలిన 10శాతం పూర్తిచేసి ఇవ్వకుండా గత నాలుగేళ్లుగా పాడుబెడుతోంది.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఎంపికచేసిన లబ్ధిదారులందరికీ ఇళ్లు పూర్తిచేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అని నారా లోకేష్‌ తెలిపారు.

టిడ్కో గృహాల వద్ద సెల్ఫీ దిగిన లోకేష్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఇచ్చే పథకాలు కట్‌ చేయడంతో కటింగ్‌ మాస్టర్‌, లబ్ధిదారులకు అందకుండా సవాలక్ష అడ్డగోలు నిబంధనలతో ఫిటింగ్‌ మాస్టర్‌ గా నేను పిలిచే సీఎం జగన్‌ రెడ్డి అసలు పేరు స్టిక్కర్‌ మోహన్‌ రెడ్డి. టిడిపి ప్రభుత్వ హయాంలో పథకాలకు తన స్టిక్కర్‌ వేసుకున్న సీఎం, టిడిపి హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకూ రంగులు వేసుకున్నారు. నాలుగేళ్ల క్రితమే ధర్మవరం 28వవార్డులో టిడిపి పూర్తి చేసిన ఈ ఇళ్లు, లబ్ధిదారులకు అప్పగించకుండా శిథిలావస్థకి చేర్చారు. నేను పర్యటనకి వస్తున్నానని తెలిసి నాలుగు రోజుల నుంచీ తమ చేతగాని పాలనని కవర్‌ చేసుకునేందుకు టిడ్కో ఇళ్లకు కలర్‌ కొట్టారని లోకేష్‌ దుయ్యబట్టారు.

ఆదివారం యువగళం పాదయాత్ర ఇలా

ఆదివారం ఉదయం 8 గంటలకు ధర్మవరం సిఎన్‌ బి క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 8.45 గంటలకు గొట్లూరులో కురుబ సామాజికవర్గీయులతో భేటీ.. 9.50  గంటలకు నాగలూరులో బోయ సామాజికవర్గీయులతో సమావేశం..10.30 గంటలకు వేల్పుమడుగులో పొదరాళ్లపల్లి వాసులతో సమావేశం అవుతారు. 12.10 గంటలకు బత్తలపల్లి సర్కిల్‌ లో భోజన విరామం తీసుకుని సాయంత్రం 3.30 గంటలకు బత్తలపల్లి సర్కిల్‌ నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. 4 గంటలకు బత్తలపల్లి బహిరంగసభలో యువనేత లోకేష్‌ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 5.15 గంటలకు బత్తలపల్లిలో స్థానికులతో మాటామంతీ..6.50 గంటలకు లింగారెడ్డిపల్లిలో స్థానికులతో సమావేశం నిర్వహించి రాతి 7.30 ముస్తూరు విడిది కేంద్రం చేరుకుంటారు.

లోకేష్‌ అంటే ఎందుకంత భయం?
మనస్సాక్షి, అనంతపురం : నారా లోకేష్‌ అంటే వైసీపీ నాయకులకు ఎందుకంత భయమని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. లోకేష్‌ పాదయాత్ర చేస్తుంటే మతి తప్పి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్ర ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో సాగుతుండగా.. మరోసారి లోకేష్‌ రాప్తాడు నియోజకవర్గంలోకి రానున్నారు. ఇప్పటికే చెన్నేకొత్తపల్లి మండలం మీదుగా ధర్మవరంలోకి ప్రవేశించిన నారా లోకేష్‌ పాదయాత్ర ఆదివారం బత్తలపల్లి మండలం సంజీవపురం సమీపంలోని ముస్టూరు క్రాస్‌ వరకు సాగనుంది. ఆ రోజు రాత్రి లోకేష్‌ అక్కడే బస చేయనున్నారు. తిరిగి ఈనెల 3వ తేది సంజీవపురం, ఎర్రాయపల్లి తరువాత రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్‌ పరిధిలోని మన్నీలకు చేరుకోనుంది. అక్కడి నుంచి కృష్ణంరెడ్డి పల్లి, ఇటుకలపల్లి, ఎస్కేయూనివర్శిటీ, ఆకుతోటపల్లి వరకు సాగనుంది. రాత్రి ఆకుతోటపల్లి వద్ద లోకేష్‌ బస చేయనున్నారు. ఈ మార్గంలో లోకేష్‌ కు భారీగా స్వాగతం పలికేందుకు వివిధ గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. లోకేష్‌ భోజనం పాయింట్‌ నుంచి రాత్రి బస ప్రదేశం వరకు ఆయా ప్రాంతాల్లో సునీత పర్యటించారు. అక్కడే స్థానిక నాయకులతో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. కార్యకర్తలకు భోజనం, తాగునీటి వంటి వాటిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ ఇప్పటికే రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో లోకేష్‌ పర్యటనకు భారీ స్పందన వచ్చిందన్నారు. జనం స్వచ్ఛందంగా వచ్చి యాత్రలో పాల్గొన్నారన్నారు. ఇది చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎన్ని చేసినా లోకేష్‌ కు జనం నుంచి వస్తున్న స్పందనను ఆపలేరన్నారు.

అనంతలో మూడున్నరేళ్లలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు
మనస్సాక్షి, అనంతపురం : గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్‌పై ఎల్లోమీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎ.నారాయణపురం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. శ్రీశ్రీనగర్, బీజేపీ కొట్టాల, సుఖదేవ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని వివరించారు. స్థానికంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందుతున్న తీరు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండగా సంక్షేమాన్ని విస్మరించిందని, చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయని తెలిసి ఎల్లోమీడియాతో అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తాము గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వెళ్తుంటే.. జగన్‌ సీఎం అయ్యాకే సంక్షేమ పథకాలు అందుతున్నట్లు జనం చెబుతున్నారని అన్నారు. స్థానిక సమస్యలను కూడా తమ దృష్టికి తెస్తున్నారని, వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో కేవలం రోడ్లు, డ్రెయినేజీ పనులను రూ.600 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. అనంతపురం నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో రూ.80 కోట్లతో అబివృద్ధి పనులు చేపట్టామన్నారు.  గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, వైసీపీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి,  జేసీఎస్‌ కన్వీనర్‌ ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఎంపీటీసీ నాగేంద్ర, వైసీపీ నేతలు జగన్‌మోహన్‌రెడ్డి, మల్లెల వేణుగోపాల్, బి.మదన్‌మోహన్‌రెడ్డి, హాజివలి, కృష్ణారెడ్డి, బషీర్,పుల్లారెడ్డి, జాఫర్, రామానుజన్‌రెడ్డి, పురుషోత్తం రెడ్డి,  రమణారెడ్డి, పుల్లయ్య, రాధాకృష్ణ, గంగాధర్, భారతి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే మడకశిరలో వక్క మార్కెట్‌
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వక్కలిగలకు దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తామని  నారా లోకేష్‌ పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గం, గుట్టూరు హైవే వద్ద కుంచిటిగవక్కలిగ సామాజిక వర్గీయులతో గురువారం  లోకేష్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వక్కలిగలను టీడీపీ రాజకీయంగా ప్రోత్సహిస్తోంది. వక్కలిగలను మంత్రి, ఎమ్మెల్యే చేసిన ఘనత టీడీపీదే. ఎన్టీఆర్‌ హయాంలో హెచ్‌.బి.నరసయ్యకు న్యాయశాఖా మంత్రిగా అవకాశం కల్పించారు. పట్టురైతులకు ఈ ప్రభుత్వం పెట్టిన రూ.45 కోట్ల బాకీ మేము చెల్లిస్తాం. అధికారంలోకి రాగానే వక్క మార్కెట్‌ ను మడకశిరలో ఏర్పాటు చేస్తాం. సీమకు తెచ్చిన నీరు వృథా చేయకుండా డ్రిప్‌ ద్వారా పంటలకు అందించాం. 90 శాతం సబ్సీడీతో డ్రిప్‌ ఇస్తుంటే జగన్‌ రద్దు చేశాడు. మడకశిర పరిధిలో టీడీపీ హయాంలో పట్టు రైతులకు 1000 షెడ్లు నిర్మించాం. హంద్రీనీవా 90 శాతం పూర్తి చేశాం..10 శాతం చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ.వక్కలిగలను ఓబీసీలో చేర్చడం బీసీ కమిషన్‌ నిర్ణయం తీసుకోవాలి. దీనిపై పార్టీ అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని లోకేష్‌ అన్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలకు ఫీజు రీఎంబర్స్‌ మెంట్‌ పరిశీలిస్తామని లోకేష్‌ తెలిపారు. ‘‘టీడీపీ హయాంలో తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇచ్చాం.అధికారంలోకి వచ్చాక పెద్దలతో చర్చించి కర్నాటక, తమిళనాడులో చదివేవాళ్లకు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటాం. స్థానికంగా మంచి కాలేజీలు, యూనివర్సీటీలు తీసుకొస్తే బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. అడ్డగోలుగా బీసీలపై కేసులు పెడుతున్నారు.బీసీల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే తెస్తాం. కేసులు రివ్యూ చేయడానికి జిల్లా స్థాయిలో కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం.స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో 16 వేల పదవులు బీసీలు కోల్పోయారు. టీడీపీ స్థాపనతోనే బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వాతంత్య్రం వచ్చింది. అప్పులు, సరుకుల ధరలు, గంజాయిలో ఏపీ టాప్‌ లో ఉంది’’ అని నారా లోకేష్‌ విమర్శించారు.

రాప్తాడు నియోజకవర్గంలోకి నారా లోకేష్‌ ఎంట్రీ
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగురోజుల పాటు కొనసాగిన యువగళం పాదయాత్ర గురువారం  గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గుట్టూరులో శిలాఫలకాన్ని లోకేష్‌ ఆవిష్కరించారు.  గోరంట్ల, మడకశిర ప్రాంతాల తాగు, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఇక్కడ హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  పెనుకొండ నియోజకవర్గం హరిపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగింది.   కియా ఫ్యాక్టరీ  వద్ద  లోకేష్‌ సెల్ఫీ దిగారు. కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులు, సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం అమ్మనపల్లి వద్ద యువనేతకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా యువనేతకు మహిళలు హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. గుట్టూరు హైవే సమీపంలో భోజన విరామస్థలంలో కుంచిటిగ వక్కలిగలతో సామాజికవర్గీయులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.

సాయంత్రం సికె పల్లి పంచాయితీ కోన క్రాస్‌ వద్ద పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మాజీమంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ ఆధ్వర్యంలో రాప్తాడు నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.  పూలవర్షం కురిపించి బాణాసంచా మోతలు, డప్పుశబ్ధాలతో హోరెత్తించారు. కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ పాదయాత్ర కోన క్రాస్‌ వద్ద విడిది కేంద్రానికి చేరుకుంది.

శుక్రవారం యువగళం పాదయాత్ర ఇలా

లోకేష్‌ పాదయాత్ర శుక్రవారం రాప్తాడు నియోజకవర్గంలో కొనసాగనుంది. ఉదయం 8 గంటలకు సికె పల్లి పంచాయితీ కోన క్రాస్‌ క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 9 గంటలకు సికె పల్లిలో వెంకటంపల్లి గ్రామస్థులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత సికె పల్లి బిసికాలనీలో బిసి సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. 10.20 గటంలకు యర్రంపల్లిలో జాకీ ఫ్యాక్టరీ బాధితులతో సమావేశం అవుతారు. 11 గంటలకు నాగసముద్రం క్రాస్‌ వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు. 11.50 గంటలకు నాగసముద్రం గేట్‌ వద్ద ఆటోడ్రైవర్లు, మెకానిక్‌లతో సమావేశం ఉంటుంది. అనంతరం నాగసముద్రంలో స్థానికులతో భేటీ అవుతారు. 1.40 గంటలకు బసినేపల్లి క్రాస్‌ వద్ద భోజన విరామం ఉంటుంది. మళ్లీ సాయంత్రం 4.00 గంటలకు బసినేపల్లి క్రాస్‌ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 4.35 గంటలకు ఉప్పరవాండ్ల కొట్టాలు క్రాస్‌ వద్ద సత్యసాయి వర్కర్లతో సమావేశం అయ్యాక.. 5 గంటలకు  పైదిండి సమీపంలో బహిరంగసభలో లోకేష్‌ ప్రసంగిస్తారు. 6.20 గంటలకు పైదిండి శివార్లలో విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

పరిటాల సునీత హయాంలో రూ.200 కోట్ల విలువైన భూముల కబ్జా
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో రూ.200 కోట్ల విలువైన భూములను నకిలీ డాక్యుమెంట్లతో కబ్జాలు చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. అనంతపురం చుట్టూ నకిలీ పట్టాలతో భూములను కొట్టేశారని అన్నారు. అనంతపురంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘అనంతపురం రూరల్‌ మండలంలో జగనన్నకాలనీల్లో ఇళ్ల పట్టాలు పొందలేని వారు దాదాపు 14 వేల మంది ఉన్నారు. వీరిలో పాపంపేట, కక్కలపల్లి కాలనీ, కొడిమి, రాచానపల్లి, అక్కంపల్లి తదితర ప్రాంతాల్లో 2,500 మంది ఉన్నారు. ప్రభుత్వ భూములన్నీ దొంగల చేతుల్లో పెట్టేసి ప్రభుత్వం డబ్బులిస్తే ఆ భూములను కొనుగోలు చేసి ఇస్తామంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్‌ కాదు. కొడిమి పొలంలో మూడు రోజుల కిందట జరిగిన కబ్జాను రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు.  డీసీ శ్రీనివాసులు అనే వ్యక్తి రైతుకూలీ. మూడేళ్లుగా ఈ భూమిని సాగుచేసుకుంటున్నాడంటూ 1996లో రికార్డుల్లో ఉంది. దాన్ని హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలో ఉన్న బీసీ శ్రీనివాసులుగా పేరు మార్చారు. ఆయనకు 1996లో పట్టా ఇచ్చినట్టు డిఫారం తయారు చేసి అసైన్డ్‌ చేశారు. ఆయన మిల్ట్రీ అని ఎక్కడా కనబరచలేదు. సైనిక సంక్షేమ శాఖ నుంచి ఆయనకు భూమి కేటాయించమని లేఖ ఇవ్వలేదు. కలెక్టర్‌ అనుమతి ఇచ్చింది లేదు. ఈ భూమిని 2014లో మహేంద్రరెడ్డి అనే వ్యక్తి  రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. పూర్తిస్థాయిలో డాక్యుమెంట్లు లేకపోవడంతో పెండిరగ్‌ రిజిస్టర్‌ చేశారు.  పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు.. కోన శశిధర్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు 22ఏ నుంచి ఈ భూమిని తొలిగించారు. కలెక్టర్‌ సొంత నిర్ణయమైనా తీసుకుని ఉండాలి లేదంటే పరిటాల సునీత చెప్పి చేయించి ఉండాలి.  కంఠా శ్రీనివాసులు అనే వ్యక్తి భూ కబ్జాదారుడు. ఈ విషయాన్ని ఈనాడు పత్రికా ప్రచురించింది. అతను సాక్షిగా సంతకం చేశాడు.  ఒక దొంగ సాక్షి సంతకం చేస్తే మరో దొంగ రిజిష్టర్‌ చేస్తే ఇంకో దొంగ దాన్ని కొనుగులు చేశాడు. కొడిమి గుట్ట కింద 40 ఎకరాల ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

భూ కబ్జాదారులపై ఆరోపణలు చేస్తూ గతంలోనే నేను ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ చెప్పాను. ఆ తర్వాత ఎంతోకొంత స్పందించిన రెవెన్యూ అధికారులు కొన్ని భూములను ఆన్‌లైన్‌ నుంచి తొలిగించారు. కొన్ని భూములను రెడ్‌మార్క్‌లో ఉంచారు. కొన్ని భూములను రిజంషన్‌ చేశారు.  కొడిమి జగనన్నకాలనీ పక్కన, కురుగుంట వైఎస్సార్‌ కాలనీ పక్కన, ఉప్పరపల్లి, సోములదొడ్డి ప్రాంతాల్లో విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇందులో రెవెన్యూ అధికారుల సహకారం చాలానే ఉంది. మాజీ సైనికుల పేరుతో ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి అమ్ముకుంటున్నారు. 2014`2019 మధ్య ఆన్‌లైన్‌లో ఎక్కించారు. 2004`2009 మధ్యనే ఎంఆర్‌ఓ కార్యాలయంలో రికార్డుల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ల్యాండ్‌ అసైన్డ్‌ ఫర్‌ ఎక్స్‌మిల్ట్రీ అని ఎంట్రీ చేశారు. 2012 నుంచి ఆన్‌లైన్‌ విధానం వచ్చినప్పుడు వెబ్‌ల్యాండ్‌లో ఈ ఫేక్‌ మిల్ట్రీ పట్టాల వివరాలు ఎందుకు ఎక్కించలేదు?  2014 నుంచి 2018 వరకు ఆన్‌లైన్‌లో ఎక్కించారు. అధికారంలో ఉన్న మంత్రి, నాయకులు, రెవెన్యూ అధికారులు వాటాలు పంచుకున్నారు. పరిటాల సునీత హయాంలో జరిగిన అతిపెద్ద భూ కుంభ కోణం అనంతపురం రూరల్‌ మండల పరిధిలో ఫేక్‌ మిల్ట్రీ పట్టాలు. చాలామంది టిడిపి నాయకుల వద్ల సీళ్లు ఉన్నాయి. అన్వర్‌హుసేన్‌ లాంటి అధికారుల సంతకాలను చాలామంది చేస్తారు.

ఆంధ్రజ్యోతి విలేకరికి కొడిమి పొలం 149`2 సర్వే నంబరులో 4.34 ఎకరాల భూమి ఉంది. 149`3లో 3.02 ఎకరాల భూమి మరో విలేకరికి ఉంది. ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు విలేకరులకు భూములు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులకు కమీషన్లు ఇచ్చేసి ఫేక్‌ డాక్యుమెంట్లు తయారు చేశారు. 5 ఎకరాల డాక్యుమెంట్‌కు 25 లక్షల వరకు అమ్మకాలు చేశారు. స్కామ్‌ల ద్వారా భూములు పొందిన వారి వివరాలను సేకరించివారిని పిలిపించిన అప్పటి మంత్రి పరిటాల సునీత  కోట్లాది రూపాయలు దండుకున్నారు. కాబట్టే ఈ విషయంలో ఆమె నోరు విప్పడం లేదు’’ అని ప్రకాష్‌రెడ్డి తెలిపారు.

చంద్రబాబు పాలనలో ఇన్ని పథకాలు వచ్చేవా?
మనస్సాక్షి, అనంతపురం : చంద్రబాబు హయాంలో జరిగిన పరిపాలనకు, ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగుతున్న పాలనకు మధ్య మార్పును ప్రజలే గమనించాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కోరారు. 2014 నుంచి 2019 వరకు సంక్షేమ పథకాలు అందాలంటే ఎలాంటి పరిస్థితి ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గడిచిన మూడున్నరేళ్లలో అర్హతే ప్రామాణికంగా ప్రతి గడపకు సంక్షేమాన్ని చేరువ చేస్తున్నామని చెప్పారు. బుధవారం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న విద్యుత్‌ కళాభారతి ఫంక్షన్‌ హాల్‌లో ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ వారోత్సవాలు నిర్వహించారు. 1020 మహిళా సంఘాలకు సంబంధించి రూ.7.87 కోట్ల మెగా చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు గుర్తింపు, గౌవరం వచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. సమాజం బాగుపడాలంటే మహిళలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళాభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చూడాలని సూచించారు. ప్రజలకు మంచి చేసే విషయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పారు.

ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలోనే ఏకంటా రూ.2 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేశామన్నారు. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతపురం నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత కింద రూ.25 కోట్ల 60 లక్షలు అందిస్తున్నామన్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత కింద ఏటా రూ.18750 ఆర్థికసాయం చేస్తున్నామని తెలిపారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. గతంలో మహిళా సంఘాలకు రూ.5 లక్షలు మాత్రమే రుణ సదుపాయం ఉండేదని, కానీ జగన్‌ సీఎం అయ్యాక రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించామని తెలిపారు.

2014లో చంద్రబాబు ఇచ్చిన హామీ వల్ల మహిళా సంఘాలు రుణాలు చెల్లించలేదని, ఫలితంగా సంఘాలు ఏ గ్రేడ్‌ నుంచి సీ గ్రేడ్‌కు చేరుకున్నాయన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతల్లో మహిళల రుణాలు మాఫీ చేస్తున్న ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. ఇప్పటికే రూ.19 వేల కోట్లు అందించామని, వచ్చే ఏడాది నాల్గో విడత అందిస్తామన్నారు. సంక్షేమ పథకాలను క్యాలెండర్‌ ప్రకారం అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రభుత్వ పథకాలను టీడీపీ నాయకులు బినామీలుగా మారి కాజేశారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సచివాలయ వ్యవస్థను తెచ్చి అర్హులకు నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో 36 లక్షల మందికి మాత్రమే పింఛన్‌ అందుతుంటే ఇప్పుడు 46 లక్షల మందికి పైగా పింఛన్‌ను ప్రతి నెలా ఒకటో తేదీన అందిస్తున్నామన్నారు. ఏప్రిల్‌లో 3వ తేదీన పింఛన్‌ పంపిణీ ఉంటుందని చెప్పారు. ఈ మార్పులన్నింటినీ ప్రజలు గమనించాలని కోరారు. మహిళా సంఘాల బుక్కులు రాయడానికి గతంలో డబ్బులు వసూలు చేసేవాళ్లని, కానీ నేడు ప్రభుత్వమే రీసోర్స్‌పర్సన్‌లకు రూ.10 వేలు అందిస్తోందని చెప్పారు.

అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. డ్రెయినేజీలు, రోడ్ల సమస్యలు ఎక్కడా లేకుండా చేస్తామన్నారు. మూడున్నరేళ్లలో అనంత రూపురేఖలు మార్చివేశామని చెప్పారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గతంలో పసుపు కుంకుమ పేరుతో మోసం చేసిన విధంగానే మరోసారి మోసగించేందుకు వస్తారని, వాళ్ల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా కేవలం జగన్‌ను ఓడిరచాలన్న లక్ష్యంతోనే ప్రతిపక్షాలన్నీ ఒకటిగా అవుతున్నారని, ఆ పార్టీల నాయకులను ప్రశ్నించాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. నాలుగేళ్లుగా మీకు జరిగిన మంచిని గుర్తుపెట్టుకుని వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు బుద్ధిచెప్పాలన్నారు. మీకోసం ఆలోచించే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని అన్నారు.

అంతకుముందు నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ ఓబిరెడ్డి, కార్పొరేటర్లు చంద్రలేఖ, లీలావతి, సైఫుల్లాబేగ్‌ మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అనంతపురం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. అనంతరం సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మెప్మా పీడీ విజయలక్ష్మి, నగర పాలక సంస్థ సెక్రటరీ సంగం శ్రీనివాసులు, కార్పొరేటర్లు లావణ్య, ముంతాజ్‌బేగం, మీనాక్షి, రామాంజినమ్మ, నరసింహులు, అబూసాలెహా, రామాంజనేయులు, కమల్‌భూషణ్‌, కో ఆప్షన్‌ సభ్యురాలు ఉమామహేశ్వరి, వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.