Andhra Pradesh - Manassakshi Telugu Daily

స్కాంలకు ఆద్యుడు.. చంద్రబాబు
మనస్సాక్షి, అనంతపురం : టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి స్కాంలకు ఆద్యుడిగా నిలిచారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. స్కిల్‌ స్కాంలో అక్రమాలు వెలుగుచూసి చంద్రబాబు జైలుకు వెళితే ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సింపతీ కోసం రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న వైఎస్‌ఆర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్, శ్రీకృష్ణదేవరాయ మునిసిపల్‌ హైస్కూల్స్‌లో సోమవారం నిర్వహించిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ క్యాంపులను ఎమ్మెల్యే అనంత పరిశీలించారు. వైద్య చికిత్సల కోసం వచ్చిన వారితో మాట్లాడారు.

ప్రజలకు చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం అవసరమైతే ఆరోగ్యశ్రీ రెఫరల్‌ ఆస్పత్రులకు పంపేలా ఏర్పాట్లు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ మంచి మనసున్న నాయకుడు సీఎం కుర్చీలో కూర్చుంటే పరిపాలన ఎలా ఉంటుందో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చూపిస్తున్నారని తెలిపారు. 76 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం పరితపిస్తున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద, మధ్య తరగతి ప్రజలకు వరం వంటిదని అన్నారు. పేదలు ఆరోగ్యం కోసం గతంలో అప్పులపాలయ్యే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద 3256 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు.

చట్టానికి చంద్రబాబు అతీతులా..?

అవినీతి చేసి జైలు జీవితం గడుపుతున్న చంద్రబాబు చట్టానికి అతీతులా అని ఎమ్మెల్యే అనంత ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని అన్నారు. స్కిల్‌ కేసులో బెయిల్‌కు ప్రయత్నం చేయకుండా క్వాష్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కుటుంబం, తెలుగుదేశం పార్టీ సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. కొవ్వొత్తులు వెలిగించినా, కంచాలు మోగించినా.. చేతులకు సంకెళ్లు వేసుకున్నా ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. స్కిల్‌ స్కాంలో పక్కా ఆధారాలు ఉండడంతోనే అధికారులు అరెస్ట్‌ చేశారని గుర్తు చేశారు. ఈ కుంభకోణాన్ని ముందుగా జీఎస్టీ అధికారులు గుర్తించారని తెలిపారు. చంద్రబాబు, జగన్‌ పాలనకు మధ్య తేడా ప్రజలకు తెలుసని అన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయని, ఆ ఐదేళ్లలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అనేక స్కాంలు జరిగాయని తెలిపారు. చంద్రబాబు స్కాంలకు, జగన్‌మోహన్‌రెడ్డి స్కీంలకు ఆద్యులని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఏం చేశామో చెప్పి ప్రజలను ఓటు అడుగుతామని తెలిపారు. ఏపీలో అమలు చేస్తున్న పింఛన్‌ విధానాన్ని తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశంసించారని తెలిపారు. కేరళ, వెస్ట్‌ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు కూడా ఏపీలో అమలు చేస్తున్న పథకాల గురించి చర్చించుకునే పరిస్థితి ఉందని తెలిపారు. స్కిల్‌ స్కాం 2017లోనే వెలుగు చూసిందని, అప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారని గుర్తు చేశారు. ఈ రోజు విచారణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు 17 ఎ వర్తించదని, ఇది తెలిసే రెండ్రోజులుగా చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అపద్దాలు చెబుతున్నారని తెలిపారు. ఈ స్కాంలో నారా లోకేష్‌ కూడా భాగస్వామి అని అన్నారు. ప్రజలకు మంచి చేసి జైలుకు వెళితే సింపతి వస్తుందని, స్కాంలు చేసి వెళితే రాదని హితవు పలికారు. కార్యక్రమంలో మేయర్‌ వసీం, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యుగంధర్, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్లు నాగవినుత, సాకే చంద్రశేఖర్, వైసీపీ నేతలు సుకేష్, జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

మా నమ్మకం నువ్వే జగన్‌.. ఇది ప్రజల నినాదం
మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనేది ప్రజల నినాదమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అందుకే ‘జగనన్నే మా భవిష్యత్‌’ అని జనం అంటున్నారని చెప్పారు. శుక్రవారం నగరంలోని నవోదయ కాలనీలో ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రజాప్రతినిధులతో పాటు వైసీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో కలిసి పలు కుటుంబాలను నేరుగా కలిశారు.

చంద్రబాబు పాలనకు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు తేడాను వివరించి ప్రజల మద్దతు కోరారు. భవిష్యత్‌లోనూ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఉంటారా? సంక్షేమ పథకాలు అందుతున్న తీరు బాగుందా? ఇంకా ఏమైనా మార్పు చేయాలా? అని ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. అంతకుముందు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనంత మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన పార్టీ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు కలవడమే లక్ష్యంగా ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈనెల 20వ తేదీ వరకు దాదాపు 14 రోజులు ప్రజలతో మమేకమవుతామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల 10 నెలలుగా సీఎం జగన్‌ నాయకత్వంలో క్లిష్టపరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. ఎన్నికల సమయంలో జగన్‌ చేసిన వాగ్ధానాలను 98 శాతం అమలు చేసినట్లు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. ఎక్కడా అవినీతి, పక్షపాతం లేకుండా పథకాలు అందిస్తున్నామని, అందరికీ సంక్షేమం అందించిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. పరిపాలనలో నూతన సంస్కరణలు తెచ్చి ప్రజల వద్దకు పాలన చేరువ చేశామన్నారు.  సచివాలయ వ్యవస్థ తెచ్చి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మూడేళ్ల 10 నెలల్లో రూ.2 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందజేసిన ఘనత తమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు.  ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్నారు.

2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేదని చెప్పారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. పేదల పక్షాన తమ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ తరం బాగుపడాలన్నా.. భవిష్యత్‌ తరాలకు ఉజ్వల భవిష్యత్‌ ఉండాలన్నా వైసీపీ అధికారంలో ఉండాలని, జగన్‌ సీఎంగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి క్లస్టర్‌ పరిధిలో రోజూ 10 నుంచి 15 కుటుంబాలను కలిసి ప్రజామద్దతు కోరనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజల సమ్మతితో ప్రతి ఇంటికీ స్టిక్లర్లు అందిస్తామన్నారు. వైసీపి జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య మాట్లాడుతూ పేదలకు ఏదైనా మంచి జరిగిందంటే అది జగన్‌ సీఎం అయిన తర్వాతేనని చెప్పారు. భవిష్యత్‌లో ఇంకా మంచి జరగాలంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు.

నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : నారా లోకేష్‌కు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సవాల్‌
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : నారా లోకేష్‌ ఓ దద్దమ్మ అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఫైర్‌ అయ్యారు. పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు చేపట్టిన అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే తెచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే అనంత తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిడిమిడి జ్ఞానంతో వాళ్లు మాట్లాడిన మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. లోకేష్‌ అజ్ఞాని అని ఇన్నాళ్లూ అందరూ అంటుంటే ఏదో అనుకున్నానని, నిన్న బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యలు చూశాక లోకేష్‌ అజ్ఞానం తెలిసిందన్నారు. ఇతరుల మౌత్‌పీస్‌గా లోకేష్‌ ఉంటాడని నిరూపితమైందన్నారు. ప్రభుత్వంపైన, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మీద, తనపైన అవాకులు చవాకులు పేలారని.. లోకేష్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. పక్కనోళ్లు చెప్పినంత మాత్రాన ఏది వాస్తవమో తెలుసుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర పేరుతో ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై బురదజల్లి వాళ్లే కడుక్కుంటారన్న ధోరణిలో లోకేష్‌ సాగుతున్నాడని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అనంతపురం అభివృద్ధి చెందిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 2014 నుంచి 2019 వరకు అనంతపురంలో ఏం జరిగిందో ఇక్కడి ప్రజలందరికీ తెలుసన్నారు. నిత్యం శాంతిభద్రతలకు విఘాతం కల్పించారని, ఇప్పుడు అనంతపురం ప్రశాంతంగా ఉందని చెప్పారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడ, ఎవరి కొంప కొడతారోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉండేదన్నారు. అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌ను మీరు తెచ్చిందే నిజమైతే 2015లో నేషనల్‌ హైవే పరిధిలో ఉన్న రోడ్డును ఎందుకు ఆర్‌అండ్‌బి పరిధిలోకి తెచ్చారని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో, తనకున్న పరిచయాలతో ఆర్‌అండ్‌బి నుంచి నేషనల్‌ హైవేస్‌లోకి మార్చినట్లు స్పష్టం చేశారు. అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారని తెలిపారు.

మీ బతుకంతా వినతిపత్రాలకే పరిమితం

అనంతపురంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే సహించలేక మేం వినతిపత్రాలు ఇచ్చిన పనులే అవన్నీ అని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాళ్ల బతుకంతా వినతిపత్రాలు ఇవ్వడానికే సరిపోయిందని అన్నారు. అభివృద్ధి పనులు జరిగితే వ్యతిరేకించడం.. ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తాను, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

మెంటల్‌ ఉందేమో వస్తే సూపర్‌స్పెషాలిటీలోనే చూపిస్తా

రాష్ట్ర విభజనలో ఒక అంశాన్ని పట్టుకుని అనంతపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే ఈరోజుకీ దాన్ని ప్రారంభించకుండా కేవలం సాధారణ ప్రభుత్వ ఆస్పత్రిలాగా, కోవిడ్‌ సెంటర్‌లాగా మార్చారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వ్యాఖ్యానించడంపైనా ఎమ్మెల్యే అనంత ఘాటుగా స్పందించారు. 2013లో తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై ఫేజ్‌ 3) కింద అనంతపురం మెడికల్‌ కళాశాల అప్‌గ్రేడ్‌లో భాగంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వచ్చిందని స్పష్టం చేశారు. కేవలం అనంతపురం మాత్రమే కాదని దేశవ్యాప్తంగా 39 మెడికల్‌ కళాశాలల అప్‌గ్రేడ్‌కు అప్పట్లో కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లలో కనీసం ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. వాళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు జరుగుతున్న అభివృద్ధికి తామే కారణమని చెప్పుకుంటున్నారని తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర వాటాగా రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క రూపాయి అయినా చెల్లించారా? అని ప్రశ్నించారు. ఆస్పత్రిని కోవిడ్‌కు మార్చిన మాట వాస్తవమేనని, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కోవిడ్‌ బాధితులకు వైద్యం అందించడం కోసం మార్చిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కోవిడ్‌ సమయంలోనూ తాము ప్రజల్లోనే ఉన్నామని, వాళ్లలా ప్రాణభయంతో ఇంట్లో కూర్చోలేదని స్పష్టం చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇప్పుడు ఐదు విభాగాల్లో స్పెషలిస్ట్‌ వైద్యం అందిస్తున్నామని, వాళ్లకు మెంటల్‌ ఏమైనా ఉంటే సూపర్‌ స్పెషాలిటీలోని న్యూరాలజీ విభాగంలో మంచి డాక్టర్‌తో చికిత్స అందిస్తామని చురకలంటించారు. టీడీపీ హయాంలో అనంతపురంలో ప్రారంభించి..పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ ఒక్కటుందా? అని ఎమ్మెల్యే అనంత ప్రశ్నించారు. వాళ్లలా మూడు కుంపట్లు పెట్టుకుని.. కేవలం డివైడర్లకే తాము పరిమితం కాలేదని స్పష్టం చేశారు. అనంతపురంలో అభివృద్ధి ఎలా జరుగుతోందో ప్రజలకు తెలుసని చెప్పారు.

ఒక నంబర్‌ తక్కువ నొక్కితే.. ఎన్నికల్లో నాకే జనం ఎందుకు నొక్కారు?

అనంత వెంకటరామిరెడ్డి అంటే ఏమిటో నారా లోకేష్‌ తన తండ్రి చంద్రబాబును అడిగితే చెబుతారని ఎమ్మెల్యే అనంత సూచించారు. నాలుగు సార్లు ఎంపీగా, ఒక సారి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర తనదని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సింగిల్‌ ఎలక్షన్స్‌ (ఎంపీ ఎన్నికలు) జరిగితే  పరిటాల రవీంద్ర హవాలోనూ.. టీడీపీ అధికారంలో ఉన్నా తాను గెలుపొందానని తెలిపారు. నిజంగా తాను ఒక నంబర్‌ తక్కువ నొక్కుతుంటే.. ప్రజలు తనకు, తాను ప్రాతినిథ్యం వహించే పార్టీకే అన్ని ఎన్నికల్లోనూ ఎందుకు నొక్కారో తెలుసుకోవాలని చురకలంటించారు. ఒకసారి గెలిచి మరోసారి గెలవనోళ్లు కూడా మాట్లాడుతున్నారని, మంత్రిగా పనిచేసినా దద్దమ్మ అని తెలిసే లోకేష్‌ను మంగళగిరిలో ఓడించారని విమర్శించారు.

వైఎస్‌ఆర్‌ చలవతోనే అనంతకు కృష్ణా జలాలు

తాను ఎంపీగా ఉన్న సమయంలోనే రాయదుర్గం, తుమకూరు రైల్వే లైన్‌ వచ్చిందని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.  ఆ తర్వాత టీడీపీ పాలనలో ఎంత పురోగతి సాధించారో వాళ్లే చెప్పాలన్నారు. హంద్రీనీవాకు  మూడు సార్లు శంకుస్థాపన చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. 40 టీఎంసీలను 5 టీఎంసీలకు చేశారని, లోకేష్‌ పక్కనున్న దద్దమ్మలు ఏనాడూ అడిగిన పాపానపోలేదన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2005లో 40 టీఎంసీలకు చేశామని, ఆ తర్వాత 2012లో అప్పటి మంత్రి రఘువీరారెడ్డితో కలిసి పాదయాత్ర ద్వారా నీళ్లతో పాటు నడిచి జీడిపల్లికి చేర్చిన చరిత్ర తమదని తెలిపారు. రాజకీయాల్లో కమిట్‌మెంట్‌ ఉంది కాబట్టే ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు. మీరు దద్దమ్మలు.. ప్రజలకు మంచి చేయలేదు..యోగ్యత లేదు కాబట్టే ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపైన నమ్మకం ఉండబట్టే కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి ఒక్కసీటు రాలేదని.. అయినా సిగ్గూఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

లోకేష్‌.. నీ బంధువులతోనే ఆరా తీయ్‌..!

అనంతపురం నగరంలో కమీషన్లు తీసుకుంటున్నట్లు.. వ్యాపారులను బెదిరిస్తున్నట్లు లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనంత స్పందించారు. ‘‘లోకేష్‌ బంధువులే ఇక్కడ బార్లు కూడా నడుపుకుంటున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్లను అడిగితే వాస్తవాలు తెలుస్తాయి’’ అని తెలిపారు.

మీ మాదిరి ఇంట్లో ఉండేవాణ్ణి కాదు..!

నారా లోకేష్‌ వ్యాఖ్యలన్నీ అక్కసుతో చేసినవేనని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ‘‘నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. నీ మాదిరి, నీ పార్టీ వాళ్ల మాదిరి నేను ఇంట్లో ఉండేవాణ్ణి కాదు. నిత్యం ప్రజల్లోనే ఉంటా. మేం అభివృద్ధి చేశాం కాబట్టే ప్రజలు మావైపు నిలుస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడిన ఘటనలు ఏవైనా ఉన్నాయా అంటే ఇది టీడీపీ హయాంలోనే. అప్పటి ఎంపీ, ఎమ్మెల్యేల తీరు వల్లే ఇబ్బంది పడ్డారు. నా నియోజకవర్గంలో ఒక్క కార్పొరేటర్‌ మీరు గెలవలేదు. ఎంపీటీసీలు గెలవలేదు. అది మీ చేతగానితం. దానికి కారణం మేం కాదు’’ అని చెప్పారు.

అంత ఉబలాటం ఉంటే రాజీనామా చేయించు

తాను సుమారు 11 నెలలుగా గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నానని, సీఎం జగన్‌ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఎమ్మెల్యే అనంత తెలిపారు. రాష్ట్రంలో ‘ఉన్న వాడు.. లేని వాడు’ అని ఉంటే నేను లేని వాడి పక్షానే నిలుస్తానని సీఎం జగన్‌ బహిరంగంగా ప్రకటించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోకేష్‌కు అంత ఉబలాటంగా ఉంటే హిందూపురంలో ఆయన ముద్దుల మామయ్యతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. అప్పుడు ప్రజల అభిప్రాయం తెలుస్తుందన్నారు.

పరిటాల శ్రీరాంకు లైన్‌ క్లియర్‌..!
మనస్సాక్షి, అనంతపురం బ్యూరో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో క్యాడర్‌ కూడా పని చేస్తోంది. అటు అధినేత చంద్రబాబు.. ఇటు యువనేత నారా లోకేష్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచాలని లోకేష్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలోలా ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించకుండా.. ముందు నుంచే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో పొత్తు రాజకీయాలు ఉంటాయన్న ఊహాగానాలు ఓ వైపు ఉండగానే నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో పలుచోట్ల అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్ర ముగియగా ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వరకు ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే అక్కడ అభ్యర్థులను నారా లోకేష్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌, పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. సత్యవేడులో హెలెన్‌, నగరిలో భాను ప్రకాష్‌, చంద్రగిరిలో పులివర్తి నాని, పీలేరులో నల్లారి కిశోష్‌కుమార్‌రెడ్డిలను గెలిపించాలని నారా లోకేష్‌ సూచనప్రాయంగా క్యాడర్‌కు సూచించారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్ర ముగిసింది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతుండగా..రాప్తాడు నియోజకవర్గంలోకి లోకేష్‌ మరోసారి సోమవారం అడుగుపెట్టనున్నారు.

కదిరి, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరిన నారా లోకేష్‌.. ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం భిన్నంగా ప్రసంగం కొనసాగించారు. ఆదివారం బత్తలపల్లిలో జరిగిన సభలో లోకేష్‌ ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరాం పేరును దాదాపు ఖరారు చేసినట్లు స్పష్టమవుతోంది. తన ప్రసంగంలో పరిటాల శ్రీరాంను ప్రజలు, క్యాడర్‌కు చూపిస్తూ నారా లోకేష్‌ ఏమన్నారంటే.. ‘‘ఒక యువకుడున్నాడిక్కడ.. ఉత్సాహవంతుడున్నాడు.. కష్టపడే మనస్తత్వం ఉంది. నా పాదయాత్ర అయినాక మీ దగ్గరకు వస్తాడు. ఆశీర్వదించండి..దీవించండి..కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలకు విజ్ఞప్తి. ఎవరూ భయపడొద్దు. 20 కేసులు నా మీద పెట్టారు. అటెంప్ట్‌ మర్డర్‌ ఉంది. ఎస్సీ, ఎస్టీ కేసుంది. కానీ తగ్గేదే లేదు’’ అని తెలియజేశారు. లోకేష్‌ ఇలా వ్యాఖ్యానించడంతో ధర్మవరం టీడీపీలో కొత్త జోష్‌ వచ్చింది.

బత్తలపల్లిలో జరిగిన సభలో లోకేష్‌ ప్రసంగం VIDEO

ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున పరిటాల శ్రీరాం పోటీలో ఉంటారా? లేదా? అన్న అనుమానాలు తొలగిపోయాయి. కష్టకాలంలో పార్టీకి, క్యాడర్‌కు అండగా ఉన్న శ్రీరాం వైపే టీడీపీ అధినేత చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరదాపురం సూరి.. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో డీలా పడిన తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు పరిటాల శ్రీరాం అండగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. త్వరలోనే వరదాపురం సూరి బీజేపీని వీడి టీడీపీలోకి చేరుతారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో పరిటాల శ్రీరాంకు ధర్మవరం నుంచి లైన్‌ క్లియర్‌ అయిందని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరో విద్యుత్‌ ఉద్యమానికి ఆస్కారమివ్వద్దు
మనస్సాక్షి, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మరో విద్యుత్‌ ఉద్యమానికి ఆస్కారమివ్వకండి అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ప్రజారంజక పాలనంటే పదేపదే విద్యుత్‌ భారాలు ప్రజలపై మోపటమేనా అంటూ లేఖలో ప్రశ్నించారు. 2014-19 విద్యుత్‌ వినియోగంపై ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ.2900 కోట్లు వినియోగదారులపై భారం మోపారని, మరో రూ.3083 కోట్లు గుదిబండ వేసేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. 2020-21 విద్యుత్‌ వినియోగంపై ట్రూ అప్‌ చార్జీల పేరుతో యూనిట్టుకు 65 పైసల వరకు వసూలు చేసే ఆదేశాలు ఇవ్వటం తగునా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల సందర్భంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. ఇది మాట తప్పటం, మడమ తిప్పటం కాదా? అని ప్రశ్నించారు. అదానీ బొగ్గు కొనుగోలుకు అధిక ధర ఇస్తూ, ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపటాన్ని ఖండిస్తున్నామని, విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీల భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్‌ ఏం చర్చించారంటే?
మనస్సాక్షి డెస్క్‌ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢల్లీి పర్యటన ముగిసింది. బుధవారం అమిత్‌షాను కలిసిన సీఎం జగన్‌.. గురువారం కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అందులో ప్రధానమైనవి ఏమిటంటే..!

ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బు మంజూరుచేయాలి.

రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా... రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోగలరు.

తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. ఈ డబ్బును వెంటనే ఇప్పించండి.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండిరగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండిరగులో ఉన్నాయి. వాటిని విడుదల చేసేలా చూడండి.

పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయండి. డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. వెంటనే ఈ నిధులు విడుదల చేయండి.

పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్‌ చేయండి. అదేవిధంగా  పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపండి.

రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.

త్వరలో వైసీపీ దుకాణం బంద్‌
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి : ‘‘పాదయాత్రను అడ్డుకోవద్దని జగన్‌ కి చాలా గౌరవంగా చెబితే వినలేదు... ఇప్పుడు యువగళం దెబ్బకి తాడేపల్లి ప్యాలస్‌ పునాదులు కదులుతున్నాయని టిడిపి యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లి బహిరంగసభలో యువనేత నారా లోకేష్‌ మాట్లాడుతూ ‘‘ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చిన షాక్‌ కి  జగన్‌ కి 104 డిగ్రీల జ్వరం పట్టుకుంది. ఇప్పుడు దండయాత్ర ప్రారంభం అయ్యింది. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని. పోలీసుల్ని పంపి ఇబ్బంది పెట్టాడు. నా మైక్‌, సౌండ్‌ వెహికల్‌, స్టూల్‌ లాక్కున్నారు. త్వరలో  వైసిపి దుకాణం బంద్‌ అవ్వడం ఖాయం. వైసిపి ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి రాజారెడ్డి వర్గం... రెండోది అంబేద్కర్‌ వర్గం. రాజారెడ్డి వర్గం కి అధ్యక్షుడు జగన్‌... అంబేద్కర్‌ వర్గానికి ఉండవల్లి శ్రీదేవి అధ్యక్షురాలు. అంబేద్కర్‌ వర్గంలో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసిపిలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అవినీతి గురించి తెలుసుకొని ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. అంబేద్కర్‌ గారి వర్గం బలం పెరుగుతుంటే రాజారెడ్డి వర్గం బలం తగ్గుతుంది’’ అని లోకేష్‌ అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘ జగన్‌ పరిపాలన చెత్త పరిపాలన. ఈ మాట నేను అనడం లేదు వైసిపి ఎమ్మెల్యేలే అంటున్నారు. పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో వైసిపి ని రాష్ట్ర ప్రజలు పూర్తిగా డిస్మిస్‌ చేస్తారు అని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు.వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఓటు కోసం డబ్బు తీసుకునే దుస్థితి మాకు లేదు మా డబ్బే జగన్‌ అనేక సార్లు తీసుకున్నారు అని అన్నారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి.జగన్‌ ఇళ్ల పధకం పెద్ద స్కాం అని వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు.ప్రశ్నించే వారిని ప్రభుత్వం అణిచివేస్తున్నారు. ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదు. జిల్లాలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడితే నా పై నింద వేసారు అని ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ రెడ్డి అన్నారు.బానిస సంకెళ్లు తెంచుకున్నా. డా.సుధాకర్‌, డా.అచ్చెన్నని చంపినట్టే నన్ను చంపాలని చూస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి చెబుతున్నారు. జగన్‌ పాలనలోడ ఒక దళిత ఎమ్మెల్యే కి రక్షణ లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేస్తున్నారు అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అర్ధం చేసుకోండి.  వైసిపి ఎమ్మెల్యేలు, రాష్ట్రప్రజలంతాఅంటున్నది ఒకటే ఆయన జగన్‌ కాదు రాష్ట్రానికి పట్టిన జగనోరా. కరోనా కంటే జగనోరా వైరస్‌ రాష్ట్రానికి ప్రమాదం అని అంటున్నారు. ఈ మాట నేను అనడం లేదు వైసిపి ఎమ్మెల్యేలే అంటున్నారు.జగనోరా వైరస్‌ రాష్ట్రానికి ఎంత ప్రమాదమో మీరంతా తెలుసుకోవాలి. జాబ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా గా ఉన్న రాష్ట్రాన్ని జగనోరా వైరస్‌ గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ గా మార్చేసింది. ఆఖరికి తిరుమల వెంకన్న సన్నిధిలో గంజాయి అమ్ముతున్నారు. వైసిపి నాయకులు వ్యవసాయం మానేసి గంజాయి పొలాల్లో పండిస్తున్నారు. నిన్నే గురజాల లో వైసిపి నాయకుడి పొలంలో గంజాయి పండిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. జగనోరా ఆంధ్రప్రదేశ్‌ ని అప్పులప్రదేశ్‌  గా మార్చేసాడు. అభివృద్ధి నిల్లు...అప్పులు ఫుల్లు. చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రానికి కియా, టీసీఎల్‌, హెచ్సిఎల్‌ లాంటి పెద్ద సంస్థలు వచ్చాయి. జగనోరా హయాంలో బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, గోల్డ్‌ మెడల్‌ వచ్చాయి. జగనోరా కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తాడు. ఆయన దగ్గర రెండు బటన్స్‌ ఉంటాయి. ఒక బటన్‌ నొక్కగానే సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీ అకౌంట్‌ లో 10 రూపాయిలు పడతాయి. అదే బల్ల కింద రివర్స్‌ బటన్‌ ఉంటుంది అది నొక్కగానే మీ అకౌంట్‌ నుండి 100 రూపాయిలు జగన్‌ ఖాతాలోకి వెళ్లిపోతాయి.  కరెంట్‌ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఏపీ నంబర్‌1. ఇంటి పన్ను రెట్టింపు చేసాడు, చెత్త పన్ను వేసాడు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇదే రివర్స్‌ బటన్‌. జగనోరా వైరస్‌ మహిళల్ని కూడా పట్టి పీడిస్తుంది. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. అందుకే మహిళలు ఎక్కడ చీపుర్లతో కొడతారో అని బయపడి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్‌ అన్నాడు. పెన్షన్‌ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అన్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు...,మరి కరెంట్‌ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.  మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. జగనోరా ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తా అని  200 వారాలు దాటినా సీపీఎస్‌ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్‌, 8 టిఎ, డీఏలు పెండిరగ్‌ పెట్టాడు’’ అని నారా లోకేష్‌ తెలిపారు.

యువత భవిష్యత్‌ తో జగన్‌ ఆటలు!

యువత భవిష్యత్తు తో ఆటలాడుతున్నాడు జగనోరా.  జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్‌2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్‌ స్టడీ సర్కిల్స్‌, బీసీ స్టడీ సర్కిల్స్‌ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్‌  పధకం రద్దు చేసాడు. జగన్‌ రెడ్డి టెన్త్‌ ఫెయిల్‌ అందుకే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వెయ్యలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్‌ ఇస్తాం. జగన్‌ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్‌ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేస్తాం.

బిసి, ఎస్సీ, మైనారిటీలపై అడుగడుగునా దాడులు

బీసీలకు తీరని అన్యాయం చేసాడు జగనోరా. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్‌ కట్‌ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు. బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.  వైసిపి పాలనలో దళితులకు రక్షణ లేదు. డాక్టర్‌. సుధాకర్‌ ని వేధించి చంపేశారు. ఇప్పుడు డాక్టర్‌. అచ్చెన్న. సిఎం సొంత జిల్లా లోనే దళితులకి రక్షణ లేదు. అచ్చెన్న ని చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ దళిత యువకుడు సుబ్రమణ్యం ని చంపి డోర్‌ డెలివరీ చేశారు. దళితులకు ఇవ్వాల్సిన 27 సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది.జగనోరా పాలన లో మైనార్టీలకు రక్షణ లేదు. అబ్దుల్‌ సలాం కుటుంబాన్ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.చదువుల తల్లి మిస్బా ని టిసి ఇచ్చి పంపి ఆత్మహత్య చేసుకునే లా చేశారు. మైనార్టీల కోసం ఏర్పాటు చేస్తామన్న ఇస్లామిక్‌ బ్యాంక్‌ హామీ ని మర్చిపోయారు. జగన్‌ రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్నాడు. ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్‌ గడ్డ. అప్పర్‌ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది.రిలయన్స్‌, అమరరాజా, జాకీ  వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు ఖర్చుచేస్తే, జగన్‌ వెయ్యికోట్లు కూడా ఖర్చుచేయలేని దద్దమ్మ జగన్‌ రెడ్డి. ఇక్కడ ప్రజలకు మేలుచేసిన నిజమైన రాయలసీమ బిడ్డ చంద్రబాబునాయుడు’’ అని లోకేష్‌ తెలిపారు. పాదయాత్రలో బీకే పార్థసారధి, సవితమ్మ, నిమ్మలకిష్టప్ప, నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అవినీతి అనకొండ.. శంకర నారాయణ
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి :  మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ టార్గెట్‌గా టీడీపీ యువనేత నారా లోకేష్‌ విమర్శనాస్త్రం సంధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శంకర నారాయణతో పాటు ఆయన సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. శంకరనారాయణ అవినీతి అనకొండ అని అభివర్ణించారు. సోమవారం పెనుకొండ నియోజకవర్గంలోని గుమ్మయ్యగారిపల్లి బహిరంగసభలో నారా లోకేష్‌ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘పెనుకొండ లో ఒక అవినీతి అనకొండ ఉంది. పేరు శంకర్‌ నారాయణ. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే మాకొద్దీ అవినీతి అనకొండ అంటూ ధర్నాలు చేస్తున్నారు అంటే ఆయన దోపిడీ ఏ రేంజ్‌ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ లేఅవుట్‌ వేసినా.. వారినుంచి ఎమ్మెల్యే శంకర్నారాయణ ఎకరాకు 10 లక్షలు వసూలు చేస్తున్నాడు. పెన్నానది నుంచి రోజుకు 100 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇసుకను బెంగళూరుకు  తరలించి రోజుకు ఐదు నుంచి పది లక్షలు జేబులో వేసుకుంటున్నాడు. దొంగ వే బిల్లులు సృష్టించి కర్ణాటక నుంచి ప్రతి రోజు నకిలీమద్యం, డీజిల్‌ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడు.  కర్ణాటక డిజిల్‌ విక్రయిస్తూ రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు. మూడేళ్లపాటు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు.  మంత్రిగా పనిచేసిన మూడేళ్లలో రాష్ట్రంలో ఒక రోడ్డు కూడా వేయలేదు. సొంత నియోజకవర్గంలో గుంతలు పడినా రోడ్లను రిపేర్‌ కూడా చేయని మంత్రిగా పేరు గడిరచాడు. రాష్ట్ర చరిత్రలో ఒక రోడ్డు కూడా వేయకుండా మూడేళ్లపాటు రోడ్ల మంత్రిగా పనిచేసిన మంత్రిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ఇవ్వాలి.తాను సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకున్నాడు. పెనుకొండ లో డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అవినీతి అనకొండ ఇంద్ర భవనానికి మాత్రం డ్రైనేజ్‌ ఏర్పాటు చేసుకున్నారు. కియా కార్మికుల శ్రమని కూడా దోచుకుంటున్నారు శంకరనారాయణ. ఎమ్మెల్యే శంకర్నారాయణ బినామీ ఏజెన్సీల ద్వారా కియా పరిశ్రమకు లేబర్‌ ను అందిస్తున్నారు. అయితే కియా కంపెనీ వాళ్లు ఒక్కో లేబర్‌ కు రోజుకు 800 ఇస్తుండగా ఈయన మాత్రం 400 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాడు. అంటే ఒక్కో కార్మికుడి నుంచి నెలకు 12 వేల రూపాయలు దోచుకుంటున్నాడు. టిడిపి ప్రభుత్వం కియా పరిశ్రమ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తే ఆ ఉద్యోగుల నుంచి వైకాపా నాయకులు దోచుకుంటున్నారు.టిడిపి ప్రభుత్వం కియా పరిశ్రమను ఏర్పాటు చేసినప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యతిరేకించారు. రైతుల నుంచి తీసుకున్న భూములను వెనక్కు ఇప్పిస్తామని రెచ్చగొట్టాడు. ఇప్పుడు అదే కియా పరిశ్రమలో ఎమ్మెల్యే శంకర్నారాయణ, తమ్ముళ్లు కాంట్రాక్ట్‌ పనులు చేసుకుంటున్నారు. కీయాలో క్యాంటీన్‌ దగ్గర నుంచి స్క్రాప్‌ కాంట్రాక్ట్లు అన్ని బెదిరించి మరీ లాక్కున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కియా అనుబంధం పరిశ్రమల కోసం ధర్నా అంటూ హై డ్రామా ప్లే చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లకు కమిషన్లు ఇచ్చుకోలేక వంద అనుబంధ సంస్థలు తమిళనాడుకు వెళ్ళిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అనుబంధ సంస్థలు మొత్తం పరిశ్రమలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉండేవి. ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ నియోజకవర్గంలోని ఒక్కొక్క మండలానికి ఒక తమ్ముడిని ఇన్చార్జిగా నిర్మించి సామంత రాజులను చేశాడు. వాళ్లు నిత్యం భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటివరకు వందల ఎకరాలను కాజేశారు.శంకర్‌ నారాయణ ఆయన తమ్ముళ్ళ అవినీతిపై వైసిపి నేతలే ప్రశ్నిస్తున్నారు. అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. ప్రశ్నించిన వైసిపి నాయకుల్ని పోలీస్‌ స్టేషన్లో పెట్టి కొట్టిస్తున్నాడు. పేదలకి ఇళ్ళ స్థలాలు, పక్కా ఇళ్ళ నిర్మాణం పేరుతో రూ.250 కోట్లు కొట్టేశారు శంకర్‌ నారాయణ అండ్‌ బ్రదర్స్‌.  టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కియా అనుబంధ సంస్థలు అన్ని తిరిగి రాష్ట్రానికి తీసుకొస్తాం. లేపాక్షి భూములు వెనక్కి తీసుకోని పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం.హంద్రీనీవా పూర్తి చేసి నియోజకవర్గం లో సాగు, త్రాగు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా. పెనుకొండ ను అభివృద్ది చేసింది టిడిపి. ఇక్కడ వేసిన రోడ్లు, త్రాగునీరు ప్రాజెక్టులు అన్ని మా హయాంలో చేసినవే. వైసిపి వచ్చాకా దోచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు.పెనుకొండ మళ్ళీ అభివృద్ది బాట పట్టాలి అంటే టిడిపి ని గెలిపించండి.ఉమ్మడి అనంతపురం జిల్లా మా కుటుంబాన్ని ఆదరించింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో కంటే రెట్టింపు అభివృద్ది చేస్తాం. అన్న ఎన్టీఆర్‌, ముద్దుల మావయ్యను అభిమానించి గెలిపించిన జిల్లా అనంతపురం. రాబోయే ఎన్నికల్లో టిడిపిని గెలిపించండి. అభివృద్ధి చేసి చూపిస్తాం’’ అని నారా లోకేష్‌ తెలిపారు.

పెనుకొండకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

‘‘ఇక్కడో ఎంపి ఉన్నాడు. సమస్యలపై పోరాడాలని ప్రజలు డిల్లీ పంపిస్తే బట్టలు విప్పుకుని తిరుగుతున్నాడు. ఒక్క సమస్య గురించి కూడా ఆయన డిల్లీలో పోరాడలేదు’’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఉద్దేశించి నారా లోకేష్‌ అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుకొండ నియోజకవర్గం వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా గోరంట్ల మండలానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు. టిడిపి గెలిచిన వెంటనే పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. పెనుగొండ నియోజకవర్గం లో కురుబ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఇక్కడ  గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. రెండున్నర సంవత్సరాల కిందట ఇక్కడ  గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న శంకర్‌ నారాయణ దీని గురించి పట్టించుకోలేదు. ఇప్పటివరకు గొర్రెపిల్లని ఇచ్చిన పాపాన పోలేదు. గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం కోసం మంజూరు చేసామని చెప్పిన రెండు కోట్ల రూపాయలు ఏమయ్యాయో ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ సమాధానం చెప్పాలి.పెనుగొండ కేంద్రంగా మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తామని స్వయంగా సీఎం జగన్‌ రెండేళ్ల  క్రిందట ప్రకటించారు. రెండేళ్లలో రెండుసార్లు శంకుస్థాపన చేశాడు. ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. రాష్ట్రవ్యాప్తంగా 14 మెడికల్‌ కాలేజీలు పెడతామని నాలుగేళ్లుగా మాటలు చెబుతున్నారు తప్ప పునాదిరాయి వేసింది లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మెడికల్‌ కళాశాల నిర్మాణం పూర్తిచేస్తాం అని నారా లోకేష్‌ తెలిపారు.

మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ను గాలికొదిలేశారు!

టిడిపి హయాంలో మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ 90 శాతం పూర్తి చేసి మడకశిరలోని చెరువుకు నీరు అందించాం. అక్కడక్కడ బ్రిడ్జిలు, కల్వర్టులకు సంబంధించిన పనులు మాత్రమే పెండిరగ్లో ఉన్నాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ను గాలికి వదిలేసింది. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా  పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే కాలువను పూర్తి చేసి మడకశిరలోని 100 చెరువులకు నీరు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన జగన్‌..ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు..బ్రాంచ్‌ కెనాల్‌ నిర్మాణం పూర్తి  చేయకుండా.. ఇప్పుడు బైపాస్‌ కెనాల్‌ నిర్మిస్తామని కొత్త మాట చెబుతున్నాడు. ఉన్నదాన్ని పూర్తి చేయలేని వాడు కొత్త కాలువ నిర్మిస్తానని చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. బైపాస్‌ కెనాల్‌ నిర్మాణంపై ప్రకటన చేసి రెండేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఒక్క గంప మట్టి అయినా తీశారా? అని లోకేష్‌ ప్రశ్నించారు. బహిరంగ సభలో టీడీపీ నేతలు పార్థసారధి, సవితమ్మ, నిమ్మల కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి నీటిపథకాన్ని దత్తత తీసుకుంటా
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి :  ‘‘సత్యసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యి అనేక గ్రామాలకు తాగునీరు అందించే పథకాన్ని జగన్‌ సర్కార్‌ నిర్వీర్యం చేసింది. కనీసం విద్యుత్‌ బిల్లులు కట్టడం లేదు. కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని సక్రమంగా నడిపించి గ్రామాలకు త్రాగునీరు అందిస్తాం. ఈ ప్రాజెక్టును నేను దత్తత తీసుకుంటాను. అనంతపురం జిల్లాలో ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీరు అందించే బాధ్యత నాది’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. పుట్టపర్తిలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు టిడిపి హయాంలో 100 కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు పనులు ప్రారంభించామని, కానీ  జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేసి రివర్స్‌ టెండరు ద్వారా వేరే కంపెనీకి అప్పగించారని చెప్పారు. ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోవడం వల్ల పనులు జరగలేదని, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే ప్రాజెక్టు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం ఒడిసి రెయిన్‌ బో ఎడ్యుకేషన్‌ అకాడమీ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్‌ మాట్లాడారు. ‘‘సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్‌ ని నమ్మడం లేదు. ఆఖరికి పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్‌ ని నమ్మడం లేదు. అందరికీ అర్ధం అయిపోయింది ఆయన జగన్‌ మోహన్‌ కాదు మోళీ మోహన్‌ అని. నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం... తాడేపల్లి ప్యాలెస్‌ ప్యాలెస్‌ లో నిన్న ఎన్ని టీవీలు పగిలాయో? అహంకారంతో వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు... ఏకంగా ప్రజలు గుండుకొట్టించి పంపేశారు. మాకు అన్నీ గుర్తున్నాయి, అట్టుకు అట్టున్నర పెడతాం. జగన్‌ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్‌ కే పరిమితం చేస్తాం’’ అని అన్నారు. అధికారపార్టీ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడేవారికి టిడిపి అధికారంలోకి వచ్చాక పెద్దపీట వేస్తామని, ఎవరూ కేసులకు భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ‘‘జగన్‌ పాలనలో ఖైదీలకు ఖర్చు చేసేది నెలకి 2 వేలు. విద్యార్థులకు ఖర్చు చేసేది వెయ్యి రూపాయిలు మాత్రమే. యువత కు అనేక హామీలు ఇచ్చిన జగన్‌ ఆఖరికి యువత చెవిలో క్యాలీఫ్లవర్‌ పెట్టాడు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రూప్‌2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్‌ స్టడీ సర్కిల్స్‌, బీసీ స్టడీ సర్కిల్స్‌ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్‌  పధకం రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్‌ ఇస్తాం. జగన్‌ విశాఖ, అనంతపురం, గుంటూరు లో మూసేసిన స్టడీ సర్కిల్స్‌ తిరిగి ప్రారంభించడంతో పాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేస్తాం’’ అని లోకేష్‌ హామీ ఇచ్చారు.  జాబ్‌ క్యాపిటల్‌ గా ఉన్న ఆంధ్రాని గంజాయి క్యాపిటల్‌ గా మార్చేశారు. నిన్న ఏకంగా తిరుమలలోనే ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తూ మీడియాకు చిక్కాడు.  కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నాడు. ఆయన దగ్గర రెండు బటన్స్‌ ఉంటాయి. ఒక బటన్‌ నొక్కగానే సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీ అకౌంట్‌ లో 10 రూపాయిలు పడతాయి.  అదే బల్ల కింద రివర్స్‌ బటన్‌ ఉంటుంది అది నొక్కగానే మీ అకౌంట్‌ నుండి 100 రూపాయిలు జగన్‌ ఖాతాలోకి వెళ్లిపోతాయి.  ఎలా వెళ్తాయో కూడా నేను చెబుతా. కరెంట్‌ ఛార్జీలు 7 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఏపీ నంబర్‌ 1. ఇంటి పన్ను రెట్టింపు చేసాడు. చెత్త పన్ను వేసాడు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇదే రివర్స్‌ బటన్‌. మహిళలకు ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోయాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్‌ అన్నాడు. పెన్షన్‌ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి అన్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. రైతులకు గిట్టుబాటు ధర లేదు, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల్ని ఆదుకోకపోగా మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. మోటార్లకు మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లగా మారబోతున్నాయి. మీటర్లు బిగించేందుకు ఎవరూ సంతకాలు చేయొద్దు. టిడిడిపి అధికారంలోకి వచ్చిన మోటార్లకు మీటర్లు ఏర్పాటుచేసే విధానాన్ని రద్దుచేస్తాం. ఉద్యోగస్తులకూ జగన్‌ రaలక్‌ ఇచ్చాడు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్‌ రద్దు చెయ్యలేదు. పోలీసులకు 4 సరెండర్స్‌, 8 టిఎ, డీఏలు పెండిరగ్‌ పెట్టాడు.

పుట్టపర్తి లో ఉన్న రెడ్డి సామాజికవర్గం వారిని కూడా ఆలోచించమని అడుగుతున్నా. మీరు ఎన్నో త్యాగాలు చేసి జగన్‌ ని గెలిపించుకున్నారు. మీరు కనీస గౌరవం దక్కిందా?సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి తప్ప ఇతర ఏ రెడ్డి సోదరుడు కైనా జగన్‌ పాలనలో న్యాయం జరిగిందా? జగన్‌ పాలనలో కాంట్రాక్టులు చేసిన రెడ్డి సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  కియా కారు చూస్తే అనంతపురం గుర్తు వస్తుంది. దటీజ్‌ చంద్రబాబు గారు. డ్రిప్‌ ఇరిగేషన్‌, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు ఇలా ఏమి చూసినా చంద్రబాబు గారు గుర్తు వస్తారు. జగన్‌ కి ఓపెన్‌ ఛాలెంజ్‌ చేస్తున్నా. అనంతపురం కి నువ్వు తెచ్చిన ఒక్క కంపెనీ ఉందా?ఒక్క అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేశానని చెప్పగలవా? రాయలసీమ బిడ్డ అని ప్రచారం చేసుకున్నాడు. ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్‌ గడ్డ. అప్పర్‌ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది.రిలయన్స్‌, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.అన్నమయ్యప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు.హంద్రీనీవా, గాలేరు నగరి ఇలా టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్‌ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే అని నారా లోకేష్‌ అన్నారు.

దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కాదు.. దోపిడీకుంట శ్రీధర్‌ రెడ్డి..!
మనస్సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా ప్రతినిధి :  పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఆయన దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కాదు.. దోపిడీకుంట శ్రీధర్‌ రెడ్డి అని అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలోని ఒడిసి రెయిన్‌ బో ఎడ్యుకేషన్‌ అకాడమీ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్‌ మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలను తూర్పారబట్టారు. లోకేష్‌ ఏమన్నారంటే.. ‘పుట్టపర్తి ఎమ్మెల్యే పేరు దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి. ఆయన ప్రజా ధనం దోపిడీ లో దిట్ట. అందుకే ఆయన పేరు మార్చాను. దోపిడీకుంట శ్రీధర్‌ రెడ్డి. దోపిడీకుంట శ్రీధర్‌ రెడ్డి, ఆయన అనుచరులు కలిసి ఆధ్యాత్మిక కేంద్రాన్ని అరాచక కేంద్రంగా మార్చేశారు. పుట్టపర్తిలో ఓ బిల్డర్‌ ను బెదిరించి కోటిన్నర రూపాయలు వసూలు చేశారు. ఓడీసీ మండలంలో టీచర్లంతా కలిసి ఏర్పాటు చేసుకున్న లేఅవుట్‌ కోసం కోటి రూపాయలు తీసుకున్నారు. కొత్తచెరువు వద్ద ఓ లేఅవుట్‌ కు దారి కోసం నిర్మించిన బ్రిడ్జి అనుమతి కోసం 75 లక్షలు వసూలు చేశారు. పుట్టపర్తిలో ఈ ఎమ్మెల్యే చేసిన అరాచాకాలు, అక్రమాలు చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోతుంది. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేస్తారని ముందుగానే తెలుసుకుని టౌన్‌ చుట్టుపక్కల అతి తక్కువ ధరకు వందల ఎకరాలు కొన్నారు. ఇది కదా అసలైన క్విడ్‌ ప్రోకో అంటే.. పుట్టపర్తి చుట్టుముట్టు ఈయన కొనడమే కాదు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేతో కూడా వందల ఎకరాలు కొనుగోలు చేయించారు. భూ వివాదాలు వీరే సృష్టిస్తారు. తర్వాత వాటిని పరిష్కరించినట్టు కలరింగ్‌ ఇచ్చి కమీషన్‌ రూపంలో లక్షలు కొట్టేస్తారు. నాలుగేళ్లలో వందల కోట్లు అక్రమంగా సంపాదించారు. ఇక్కడ సంపాదించిన డబ్బును తీసుకెళ్లి బెంగళూరు, హైదరాబాద్‌ లో పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తూ అవే లారీల్లో కర్నాటక నుంచి నకిలీ మద్యం, డీజిల్‌ దిగుమతి చేసుకుంటూ రెండుచేతులా సంపాదిస్తున్నారు. బినామీలను ముందు పెట్టి ప్రతి రోజు రేషన్‌ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్నారు. మిల్లుల వ్యాపారులతో కుమ్మక్కై దందా చేస్తున్నారు. ఇక్కడ రేషన్‌ బియ్యాన్ని కర్ణాటకలో పాలిష్‌ చేసి సన్నబియ్యంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు.

పుట్టపర్తి నియోజకవర్గానికి వచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 193 చెరువులకు నీరిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్ల పాటు దాని ఊసే ఎత్తలేదు. రెండేళ్ల కిందట ఓ జీవో విడుదల చేశారు. 864 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు.  ఆ రోజు ఇక్కడి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి చేసిన హడావిడి మాములుగా లేదు. కొన్ని లక్షలు ఖర్చుచేసి పెద్ద ర్యాలీ చేశారు. ఇక ప్రాజెక్టు కట్టేసినట్లే అని ప్రజలంతా అనుకున్నారు. కానీ రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. జగన్‌ రెడ్డి పుట్టపర్తికి వచ్చినపుడు మరో హామీ కూడా ఇచ్చారు. పుట్టపర్తిని అధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగా కూడా డెవలప్‌ చేస్తానన్నారు. చిత్రావతిలో, బుక్కపట్నం చెరువులో బోటింగ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తికి వచ్చింది లేదు.. నిధులు ఇచ్చింది లేదు. పైగా ఈ వైసిపి బ్యాచ్‌ పుట్టపర్తిలో ఉన్న ప్రశాంతతను, అందాన్ని కూడా చెడగొట్టారు.  బుక్కపట్నం మండలంలోని మారాల జలాశయాన్ని 0.5 టీఎంసీల కెపాసిటీతో 2018లోనే చంద్రబాబునాయుడు పూర్తి చేశారు.  పాదయాత్రలో భాగంగా మారాల వచ్చిన జగన్‌ రెడ్డి కాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. నాలుగేళ్లు గడిచిపోయింది. ఇప్పటివరకు ఒక్క పని కూడా మొదలుపెట్టలేదు.  మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకునే జగన్‌ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు.

పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రధాన సమస్య స్థానికంగా ఉపాధి అవకాశలు లేకపోవడం. ఓడీసీ, నల్లమాడ, అమడగూరు మండలాల నుంచి పెద్దఎత్తున కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇక్కడి నుండి కేరళకు వెళ్లిన కొందరు అక్కడ బిక్షాటన చేసి బతుకుతున్న దౌర్భాగ్యం. ఈ పరిస్థితి మారాలంటే నియోజకవర్గంలో పెద్దఎత్తున పరిశ్రమలు రావాలి. టిడిపి అధికారంలోకి రాగానే పుట్టపర్తి చుట్టూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉపాధి కల్పిస్తాం. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి లేకుండా చేస్తాం. పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని రకాల పంటలు పండిరచేందుకు అనువైన భూములు ఉన్నాయి. అయితే సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాన్ని జగన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హంద్రీనీవా ద్వారా చెరువు నింపి ఉంటే రైతులు బాగుపడేవారు. అయితే పైనున్న జగన్‌ రెడ్డికి, ఇక్కడున్న ఎమ్మెల్యేకు వారి స్వప్రయోజనాలు తప్ప జనాల గురించి పట్టదు. టిడిపి హయాంలోనే రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద చెరువైన బుక్కపట్నం చెరువుకు నీరిచ్చాం. హంద్రీనీవా ప్రధాన కాలువ పూర్తి చేశాం. మళ్లీ అధికారంలోకి రాగానే పెండిరగ్‌ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పుట్టపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇస్తున్నా. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేసి ఏడాది కావొస్తోంది. సత్యసాయి ట్రస్టు పుణ్యమా అని బిల్డింగులన్ని ఉచితంగా వచ్చేశాయి. కానీ జిల్లా కేంద్రంలో ఏ ఒక్క డిపార్ట్‌ మెంట్లోనూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. చాలా డిపార్ట్‌ మెంట్లలో ఇంటర్నెట్‌ ఫెసిలిటీ కూడా లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పిస్తాం’’ అని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌కు షాక్‌
మనస్సాక్షి, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి షాక్‌ తగిలింది. ఏడు స్థానాలకు గాను ఏడు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీ నేతలకు నిరాశే ఎదురైంది. టీడీపీ తరఫున బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు. అధికార పార్టీ నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గురువారం నాటకీయ పరిణామాల మధ్య ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. మొత్తం ఏడు స్థానాలకు గాను బరిలో 8 మంది అభ్యర్థులు నిలిచారు. వైసీపీ నుంచి పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌, పెనుమత్స వివి సూర్య నారాయణ రాజు, కోలా గురువులు, బొమ్మ ఇజ్రాయెల్‌, చంద్రగిరి ఏసు రత్నం, జయ మంగళ వెంకటరమణ.. టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ పోటీ చేశారు. అసెంబ్లీలో బలాబలాలను చూస్తే వైసీపీ 151 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీకి 23 మంది, జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా సపోర్ట్‌ ఇస్తుండటంతో వైసీపీ బలం 156కి చేరింది. ఇదే తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ తన బలాన్ని 154 గానే లెక్కలో వేసుకుంది. ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే కచ్చితంగా 22 ఓట్లు కావాలి. అంటే ఈ 154 మందిలో ఒక్క ఓటు కూడా నష్టపోకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికార వైసీపీ పక్కా వ్యూహం రచించింది. మాక్‌ పోలింగ్‌ చేపట్టింది. ఎమ్మెల్యేలందరినీ 7 టీమ్‌లుగా విభజించి.. ఒక్కో టీమ్‌కు ఒక్కో లీడర్‌ను పెట్టి ఓటింగ్‌ ప్రక్రియ ముగించింది.

గురువారం సాయంత్రం కౌంటింగ్‌ ప్రారంభించాక 175 ఓట్లు వాలిడ్‌ అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే కౌంటింగ్‌ ప్రారంభం అయ్యాక అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. పంచుమర్తికి 23 ఓట్లు పడడంతో గెలుపు సాధ్యమైంది. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది గెలిచారు. నలుగురు ఫిరాయించగా ప్రస్తుతం 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఏకంగా 23 ఓట్లు రావడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. గతంలో టీడీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఎవరైనా పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేశారా? లేక అధికార పార్టీలోనే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలే క్రాస్‌ ఓటింగ్‌ చేశారా అన్న దానిపై వైసీపీ అగ్రనేతలు సమీక్షిస్తున్నారు.

కోలా గురువులు ఓటమి

వైసీపీ నుంచి ఏడుగురు పోటీ చేయగా ఆరుగురు విజయం సాధించారు. చంద్రగిరి ఏసు రత్నం, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌, బొమ్మ ఇజ్రాయెల్‌, పెనుమత్స వివి సూర్య నారాయణ రాజులకు మొదటి ప్రాధాన్యత ఓట్లు 22 రావడంతో విజయం సాధించారు. జయ మంగళ వెంకటరమణ, కోలా గురువులకు 21 ఓట్లు చొప్పున వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా జయమంగళ వెంకటరమణ గెలుపొందారు.  కోలా గురువులు ఓడిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు కేటాయించిన వారిలోనే క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. వీరి నుంచే ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లు అనురాధకు పడినట్లు సమాచారం. ఎవరా ఇద్దరు అనేదానిపై అధిష్టానం ఆరా తీయడం ప్రారంభించింది.

విశాఖ శారదాపీఠంలో ఉగాది పంచాంగ శ్రవణం
మనస్సాక్షి డెస్క్‌ :  విశాఖ శ్రీ శారదాపీఠంలో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మ సృష్టించిన రోజుగా ఉగాదిని జరుపుకుంటున్నామని, ఉగాది వేడుకలను నిర్వహించి పంచాంగ శ్రవణం వినిపించడం విశాఖ శ్రీ శారదాపీఠం సంప్రదాయంగా పాటిస్తోందని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు.  ఆయన ఇంకా ఏమన్నారంటే.. మూడేళ్లుగా దేశాన్ని కాల సర్పదోషం వెంటాడిరదని, ఈ ఏడాది చతుర్‌ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందని తెలిపారు. దీని ప్రభావంతో దేశానికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అయితే ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు అనుకూలంగా ఉన్నందున, కొంతమేర ఇబ్బందులు తొలగవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతాయని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జాతకం దృష్ట్యా ఇబ్బంది ఉండదని తెలిపారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు అధికమై, మరణాలు సంభవిస్తాయని వివరించారు. అన్ని రాష్ట్రాల్లోను వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బలు చూడాల్సి వస్తుందని తెలిపారు.

అమెరికా వంటి దేశాలు ప్రకృతి వైవరీత్యాలను ఎదుర్కోవలసి ఉంటుందని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. జూలై నుండి సెప్టెంబరు వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు సహజంగా ఏర్పడతాయని చెప్పారు.

సీఎం జగన్‌ నివాసంలో ఘనంగా వేడుకలు

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో ఉన్న గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా  సంబరాలు జరిపారు. వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం వైయస్‌ జగన్‌ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పంచాంగాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎంజగన్‌ దంపతులు పాల్గొన్నారు.

ఉగాది వేడుకల్లో మాజీ సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో  టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు , పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో పులుపుల వెంకట ఫణికుమార్‌ శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.